AU Distance Admissions 2022: ఆంధ్ర యూనివర్సిటీలో దూర విద్య ప్రవేశాలకు 2022-23 నోటిఫికేషన్‌ విడుదల..

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వివిధ యూజీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్..

AU Distance Admissions 2022: ఆంధ్ర యూనివర్సిటీలో దూర విద్య ప్రవేశాలకు 2022-23 నోటిఫికేషన్‌ విడుదల..
Au Distance Courses

Updated on: Sep 05, 2022 | 2:19 PM

AU Distance Education 2022 application last date: విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వివిధ యూజీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏ/బీకాం/బీఎస్సీ, ఎంఏ/ఎంజేఎంసీ/ఎంహెచ్‌ఆర్‌ఎం/ఎంఎస్సీ/ఎంకాం/ఎంబీఏ/ఎంసీఏ, ఏడాది పీజీ డిప్లొమా కోర్సులు, ఆరు నెలల సర్టిఫికేట్ కోర్సులతోపాటు ఆన్‌లైన్ ప్రోగ్రాముల్లో కూడా ప్రవేశాలు కల్పిస్తోంది. అకౌంటెన్సీలో బీకాం, సోషియాలజీలో ఎంఏ కోర్సులను ఆన్‌లైన్‌లో అందిస్తోంది. ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందగోరే వారు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఇంటర్‌, డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 10, 2022వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. రూ.500 ఆలస్య రుసుముతో అక్టోబర్‌ 31, 2022వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.