Army Public School Recruitment 2022: దేశంలోని పలు ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. దేశంలో ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసౌటీ వివిధ కంటోన్మెంట్‌లు, మిలిటరీ స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఉన్న టీచర్ల పోస్టుల భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎవరు అర్హులు లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ), పీఆర్‌టీ(ప్రైమరీ టీచర్) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పై తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పీజీ, డీఈఎల్‌ఈడీ, బీఈఎల్‌ఈడీ, బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు తప్పనిసరిగా సీటెట్, టెట్ అర్హత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01-04-2022 నాటికి ష్రెషర్స్ 40 ఏళ్లు లోపు, అనుభవజ్ఞులైన అభ్యర్థులు 57 ఏళ్లలోపు ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
* అభ్యర్థులను ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్ మూల్యాంకనం, కంప్యూటర్ ప్రావీణ్యం ఆధారంగా ఎంపికచేస్తారు.
* తెలంగాణలో సికింద్రాబాద్, హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు 05-10-2022తో ముగియ నుంది.
* పరీక్షను 05-11-2022, 06-11-2022 తేదీల్లో నిర్వహిస్తుండగా, ఫలితాలను 20-11-2022న ప్రకటించనున్నారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..