Indian Army Recruitment 2022: టెన్త్‌ అర్హతతో ఇండియన్‌ ఆర్మీ గ్రూప్ సీ ఉద్యోగాలు.. నెలకు రూ.56,900ల జీతం..

ఇండియన్ ఆర్మీకి చెందిన బీహార్‌ రెజిమెంటల్‌ సెంటర్‌ (BRC) గ్రూప్ సీ పోస్టు (group c posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

Indian Army Recruitment 2022: టెన్త్‌ అర్హతతో ఇండియన్‌ ఆర్మీ గ్రూప్ సీ ఉద్యోగాలు.. నెలకు రూ.56,900ల జీతం..
Bihar Regimental Centre
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 17, 2022 | 4:34 PM

Army Bihar Regimental Centre Group C Recruitment 2022: ఇండియన్ ఆర్మీకి చెందిన బీహార్‌ రెజిమెంటల్‌ సెంటర్‌ (BRC) గ్రూప్ సీ పోస్టు (group c posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 12

పోస్టుల వివరాలు: గ్రూప్ సీ సివిలియన్ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్‌ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ. 18,000ల నుంచి 56,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు:

  • సఫాయివాలా పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • కుక్ పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కుకింగ్‌లో నైపుణ్యం ఉండాలి.
  • వాషర్ మెన్ పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే మిలిటరీ దుస్తులను శుభ్రపరచడంలో నైపుణ్యం ఉండాలి.
  • బార్బర్ పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • కార్పెంటర్‌ పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ లేదా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ నుంచి కార్పెంటర్‌గా 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: మే 13, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Groups Free Coaching 2022: తెలంగాణ మైనార్టీలకు గ్రూప్‌ 1, 2, 3, 4 ఉద్యోగాలకు ఉచిత శిక్షణ.. ఇలా దరఖాస్తు చేసుకోండి..