ARCI Recruitment 2022: బీటెక్‌/బీఈ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! రూ.80,000ల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..

|

Jul 18, 2022 | 9:02 AM

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన హరియాణాలోనున్న గురుగ్రామ్‌లో ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్ ఫర్‌ పౌడర్‌ మెటలార్జీ అండ్‌ న్యూ మెటీరియల్స్‌ (ARCI).. తాత్కాలిక ప్రాతిపదికన..

ARCI Recruitment 2022: బీటెక్‌/బీఈ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! రూ.80,000ల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
Arci
Follow us on

ARCI Haryana Project Coordinator Recruitment 2022: భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన హరియాణాలోనున్న గురుగ్రామ్‌లో ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్ ఫర్‌ పౌడర్‌ మెటలార్జీ అండ్‌ న్యూ మెటీరియల్స్‌ (ARCI).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, ప్రాజెక్ట్ అనలిస్ట్ తదితర పోస్టుల (Project Coordinator Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 27

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్టులు: 1
  • ప్రాజెక్ట్ అనలిస్ట్ పోస్టులు: 2
  • ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులు: 10
  • ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు: 10
  • ప్రాజెక్ట్ మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు: 4

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.20,000ల నుంచి రూ.80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్/ఐటీఐ/బీఎస్సీ/బీటెక్‌/పీజీ డిగ్రీ/ఎంసీఏ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 31, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.