Job Mela AP: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. డిసెంబర్‌ 4న విశాఖలో జాబ్‌మేలా.. పూర్తి వివరాలు మీకోసం..

|

Jan 02, 2022 | 7:44 AM

Job Mela AP: పలు ప్రైవేటు కంపెనీలో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఇటీవలి కాలంలో పలు జాబ్‌మేళాను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కొత్త..

Job Mela AP: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. డిసెంబర్‌ 4న విశాఖలో జాబ్‌మేలా.. పూర్తి వివరాలు మీకోసం..
Follow us on

Job Mela AP: పలు ప్రైవేటు కంపెనీలో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఇటీవలి కాలంలో పలు జాబ్‌మేళాను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కొత్త ఏడాదిలో మొదటి డ్రైవ్‌ను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే విశాఖపట్నంలో స్కిల్‌ కనెక్ట్ డ్రైవ్‌ను నిర్వహించనున్నారు. ఈ డ్రైవ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* క్యాంపస్‌ డ్రైవ్‌లో భాగంగా మొత్తం 04 కంపెనీలు పాల్గొననున్నాయి.

* పేటీఎమ్‌లో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్ట్‌లు. పదో తరగతి, అంతకంటే ఎక్కువ అర్హత ఉన్న వారు 19 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

* జయభేరి ఆటోమోటివ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉద్యోగాలకు డిప్లొమా ఇన్ మెకానికల్ & ITI మోటార్ మెకానికల్ ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 19-28 ఏళ్ల వారు అర్హులు.

* పత్ర కంపెనీలో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు ఏదైనా డిగ్రీ & మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు.

* మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌లో సాఫ్ట్‌వేర్ ట్రైనీ/యుఎస్ ఇట్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. వీటికి B.tech లేదా MCA (2020-2021) ఉత్తీర్ణత, పురుష/స్త్రీ -ఏదైనా డిగ్రీ (2019/20/21 ఉత్తీర్ణులైన B.tech, PG, MBAతో సహా) అర్హులు.

పూర్తి వివరాలు..

* ఇంటర్వ్యూ జరిగే తేదీ : 04-01-2022

* ఇంటర్వ్యూ జరిగే ప్రాంతం: పెందుర్తి, విశాఖపట్నం.

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు APSSDC అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: TS Corona: తెలంగాణాలో కరోనా నియంత్రణకు కఠిన నిబంధనలు.. మాస్క్ లేకపోతే రూ.1000 జరిమానా

Road Accident: నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎస్ఐ సహా ఆయన తండ్రి దుర్మరణం.. పెళ్లైన వారానికే..

Sudheer Babu: గ్లిజరిన్ లేకుండా ఏడ్చేయగల హీరోయిన్ ఆమె.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన సుధీర్ బాబు..