Job Mela: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఇటీవల వరుసగా జాబ్‌మేళాలను నిర్వహిస్తోంది. ప్రముఖ ప్రైవేటు కంపెనీలోన్ని ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నాయి. జిల్లా స్థాయిలో ఉన్న నిరుద్యోగులకు అనుకూలంగా స్థానికంగానే ఈ జాబ్‌మేళాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చిత్తూరు జిల్లా పీలేరులో ఆదివారం (నేడు) మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి ఈ జాబ్‌మేళా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏయే కంపెనీలు ఇంటర్వ్యులను నిర్వహిస్తున్నాయి.? ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* వినూత్న ఫర్టీలైజర్స్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు చిత్తూరులో పని చేయాలి.
* అపోలో ఫార్మసీలో.. ఫార్మసిస్ట్, ఫార్మసీ ట్రైనీస్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు తిరుపతిలో పని చేయాల్సి ఉంటుంది.
* టీవీఎస్ కంపెనీలో మిషన్ ఆపరేటర్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఎంపికై వారు చెన్నైలో పని చేయాల్సి ఉంటుంది.
* బ్యాంక్ బజార్ ఇండియా కస్టమర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయనుంది. ఎంపికైన వారు చెన్నైలో పని చేయాలి.
* గ్రీన్‌టెక్‌లో ట్రైనీ ఆపరేటర్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. కేవలం పురుషులు మాత్రమే అర్హులు. మేనకూరు, నాయిడు పేటలో పని చేయాల్సి ఉంటుంది.
* మీషోలో సేల్స్ ఆఫీసర్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. కేవలం పరుషులు మాత్రమే అర్హులు.
* ఫోన్‌లో బీడీఈ విభాగాలో ఖాళీలు ఉన్నాయి.
* అమర్‌రాజా సంస్థలో మిషన్ ఆపరేటర్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులక చిత్తూరులో పని చేయాల్సి ఉంటుంది. కేవలం పురుషులు మాత్రమే అర్హులు.
* ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో ఫీల్డ్ సేల్స్ ప్రమోటర్స్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారు చిత్తూరులో పని చేయాల్సి ఉంటుంది. కేవలం పురుషులు మాత్రమే అర్హులు. వీటితో పాటు మరిన్ని కంపెనీలు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చేసిన అభ్యర్థులు అర్హులు.
* ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల నుంచి రూ.35 వేల వరకు వేతనం లభిస్తుంది.
* పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి వయసు 18-45 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యుకు హాజరయ్యే ముందు ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
* పీలేరు నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులు గ్రామ సచివాలయాల్లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు.
* ఇంటర్వ్యూలను ఎస్‌జీ గవర్నమెంట్ డిగ్రీ, పీజీ కాలేజ్, పీలేరు, మదనపల్లి రోడ్, బొడుమల్లువారిపల్లి, చిత్తూరు అడ్రస్‌లో నిర్వహిస్తారు.
* ఫిబ్రవరి 06, 2022 ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభంకానున్నాయి.
* ఇంటర్వ్యూకి వచ్చే అభ్యర్థులు రెజ్యూమ్‌తో పాటు, విద్యార్హతల జిరాక్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ వెంట తెచ్చుకోవాలి.
* ఇతర వివరాలు, సందేహాల కోసం 8142509017, 9966086996 నంబర్లను సంప్రదించండి.
* రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వారు ఇక్కడ క్లిక్ చేయండి..
@AP_Skill has Conducting Mega Skill and Job Drive at SG Government Degree and PG College #Piler @chittoorgoap
Register at: https://t.co/Sflqq72a6b pic.twitter.com/ed1sjqEN3c— AP Skill Development (@AP_Skill) February 2, 2022
Also Read: Andhra Pradesh: సత్తా లేని నాయకుడు అంటూ.. మాజీ సీఎం సోదరుడిపై ఎంపీ ఫైర్..
Astro Tips: ఈ వాస్తు దోషాలు.. మీలో మానసిక ఆందోళనను, ఒత్తిడిని పెంచుతాయి..!