AP CETs Exam Schedule 2024: ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి పరీక్షల షెడ్యూల్ 2024 విడుదల..  అన్ని పరీక్షలు మే, జూన్‌లోనే

| Edited By: Srilakshmi C

Feb 14, 2024 | 2:53 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి గానూ వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నతవిద్యామండలి ప్రకటించింది. ఏ పరీక్షలు ఏ యూనివర్సిటీ నిర్వహిస్తోంది, ఆయా పరీక్షలకు కన్వీనర్లు ఎవరనేది కూడా ఉన్నతవిద్యామండలి ప్రకటించింది. 2024-25 విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ - అగ్రికల్చర్ - ఫార్మాసి కోర్సులకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (EAPCET) ను..

AP CETs Exam Schedule 2024: ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి పరీక్షల షెడ్యూల్ 2024 విడుదల..  అన్ని పరీక్షలు మే, జూన్‌లోనే
AP CETs Exam Schedule 2024
Follow us on

అమరావతి, ఫిబ్రవరి 14: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి గానూ వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నతవిద్యామండలి ప్రకటించింది. ఏ పరీక్షలు ఏ యూనివర్సిటీ నిర్వహిస్తోంది, ఆయా పరీక్షలకు కన్వీనర్లు ఎవరనేది కూడా ఉన్నతవిద్యామండలి ప్రకటించింది. 2024-25 విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ – అగ్రికల్చర్ – ఫార్మాసి కోర్సులకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (EAPCET) ను కాకినాడ జేఎన్టీయూ నిర్వహించనుంది.ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ECET ను అనంతపురం జేఎన్టీయూ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం ఐసెట్‌ను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, పీజీఈసెట్ ను వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహించనుంది. ఎడ్ సెట్‌ను ఆంధ్రా యూనివర్సిటీ, లా సెట్ ను నాగార్జున యూనివర్సిటీ నిర్వహించనున్నాయి. పీజీ సెట్‌ను ఆంధ్రా యూనివర్సిటీ, పీఈ సెట్‌ను నాగార్జున యూనివర్సిటీ, ఎడ్ సెట్‌ను వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ నిర్వహించనున్నాయి. అన్ని పరీక్షలు ఆన్‌ లైన్ విధానంలో మాత్రమే జరగనున్నాయి.

ఏపీ సెట్స్‌ 2024 షెడ్యూల్ ఇదే

  • EAPCET – జేఎన్టీయూ కాకినాడ – మే 13 నుంచి 19
  • ఈసెట్ – జేఎన్టీయూ అనంతపురం – మే 8
  • ఐసెట్ – శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ – మే 6
  • PGECET – శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ – మే 29 – 31
  • ఎడ్ సెట్ – ఆంధ్రా యూనివర్సిటీ – జూన్ 8
  • లా సెట్ – నాగార్జున యూనివర్సిటీ – జూన్ 9
  • పీజీ సెట్ – ఆంధ్రా యూనివర్సిటీ – జూన్ 3 – 7
  • ADCET – వైఎస్సార్ అర్చిటెక్చర్ యూనివర్సిటీ – జూన్ 13
  • ఏపీ పీఈ సెట్ – నాగార్జున యూనివర్సిటీ – తర్వాత ప్రకటిస్తారు

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.