APPSC University Jobs: ఏపీ వర్సిటీల్లో 3,282 లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. మరో 2 రోజుల్లో ప్రకటన

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి సీఎం జ‌గ‌న్ వేగంగా ముందుకెళ్తున్నారు.. ఇప్పటికే వైద్యారోగ్య శాఖ‌లో సుమారు 50 వేల‌కు పైగా వైద్యుల‌తో పాటు ప‌లు విభాగాల్లో కొత్తగా నియామ‌కాలు పూర్తి చేసారు. వైద్యరంగంలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ హాస్పిట‌ల్స్ రూపు రేఖ‌లు మార్చేస్తున్న జ‌గ‌న్ స‌ర్కార్. అందుకు త‌గ్గట్లుగా ఖాళీల‌ను కూడా భ‌ర్తీ చేస్తూ వ‌స్తుంది. ఇక మిగిలిన శాఖ‌ల్లో కూడా ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల‌ను త్వరిత‌గ‌తిన భ‌ర్తీ చేసేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని..

APPSC University Jobs: ఏపీ వర్సిటీల్లో 3,282 లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. మరో 2 రోజుల్లో ప్రకటన
APPSC University Jobs
Follow us
pullarao.mandapaka

| Edited By: Srilakshmi C

Updated on: Oct 17, 2023 | 9:51 PM

అమరావతి, అక్టోబర్‌ 17: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి సీఎం జ‌గ‌న్ వేగంగా ముందుకెళ్తున్నారు.. ఇప్పటికే వైద్యారోగ్య శాఖ‌లో సుమారు 50 వేల‌కు పైగా వైద్యుల‌తో పాటు ప‌లు విభాగాల్లో కొత్తగా నియామ‌కాలు పూర్తి చేసారు. వైద్యరంగంలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ హాస్పిట‌ల్స్ రూపు రేఖ‌లు మార్చేస్తున్న జ‌గ‌న్ స‌ర్కార్. అందుకు త‌గ్గట్లుగా ఖాళీల‌ను కూడా భ‌ర్తీ చేస్తూ వ‌స్తుంది. ఇక మిగిలిన శాఖ‌ల్లో కూడా ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల‌ను త్వరిత‌గ‌తిన భ‌ర్తీ చేసేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

ప్రభుత్వ శాఖ‌ల్లో అవ‌స‌రం త‌ప్పనిస‌రిగా అవ‌స‌రం ఉన్న చోట ఖాళీల‌ను భ‌ర్తీ చేయాల‌ని సూచించారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి చ‌ర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గ్రూప్ -1,గ్రూప్ -2 ఉద్యోగాల భ‌ర్తీకి ఏపీపీఎస్సీకి అనుమ‌తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. త్వర‌లోనే ఉపాధ్యాయ ఖాళీల‌ను కూడా భ‌ర్తీ చేస్తామ‌ని విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్యానారాయ‌ణ ప్రక‌టించారు. డీఎస్సీ కంటే ముందుగా టెట్ నిర్వహిస్తామని చెప్పారు. ఇలా ఒక్కొక్క శాఖ‌లో ఖాళీల భ‌ర్తీపై ఫోక‌స్ పెట్టిన ప్రభుత్వం ఉన్నత‌విద్యలో కీల‌క ఉద్యోగాల భ‌ర్తీకి స‌న్నద్దమ‌యింది. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాల‌యాల్లో ఖాళీగా ఉన్న భోద‌నా సిబ్బంది ఉద్యోగాల భ‌ర్తీకి త్వర‌లోనే నోటిఫికేష‌న్ ఇవ్వనుంది ప్రభుత్వం.

ఈనెల 20న నోటిఫికేష‌న్ జారీ చేయ‌నున్న ప్రభుత్వం

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాల‌యాల్లో ఏళ్ల త‌ర‌బ‌డి అధ్యాప‌కుల నియామ‌కాలు జ‌ర‌గ‌డం లేదు. యూనివ‌ర్శిటీల్లో శాశ్వత అధ్యాప‌కుల నియామ‌కాలు చేప‌ట్టి 17 ఏళ్లు పూర్తయింది. ఖాళీ అయిన పోస్టుల్లో కాంట్రాక్ట్ ప‌ద్ధతిన టీచింగ్ స్టాఫ్ ను భ‌ర్తీ చేస్తున్నారు. అయితే ఉన్నత‌విద్యారంగంలో స‌మూల‌ మార్పులు తీసుకొస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం యూనివ‌ర్శిటీల్లో క్వాలిటీ విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రాష్ట్రంలో ఉన్న 18 ప్రభుత్వ విశ్వవిద్యాల‌యాల్లో సుమారు 12 ల‌క్షల మంది విద్యార్ధులు చ‌దువుతున్నారు. వీరంద‌రికీ నాణ్యమైన‌, ఆధునిక సాంకేతిక‌తో కూడిన విద్యనందించేలా ముందుకెళ్తున్నట్లు ఉన్నత‌విద్యామండ‌లి ఛైర్మన్ హేమ‌చంద్రారెడ్డి తెలిపారు. యూనివ‌ర్శిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెస‌ర్, అసోసియేట్ ప్రొఫెస‌ర్, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ ల ఉద్యోగాల‌కు ఈనెల 20 న నోటిఫికేష‌న్ జారీ చేస్తున్నట్లు హేమ‌చంద్రారెడ్డి చెప్పారు. మొత్తం 3,282 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భ‌ర్తీ చేసేందుకు మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ చేతుల‌మీదుగా నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది స‌ర్కార్.

ఇవి కూడా చదవండి

యూనివర్సిటీల్లో ఇంత భారీగా నియామ‌కాలు జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి. అయితే ఎప్పటి నుంచో కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో ప‌నిచేస్తున్న అధ్యాప‌కుల‌కు ప్రత్యేక వెయిటేజి ఇవ్వనుంది ప్రభుత్వం. 3282 పోస్టుల్లో 2600 మంది కాంట్రాక్ట్ ప‌ద్ధతిన ప‌నిచేస్తున్నారు. వీరిలో వెయ్యి మంది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రాం కింద ప‌నిచేస్తున్నారు. ఈ వెయ్యి మంది మిన‌హా మిగిలిన వారికి ప‌ది శాతం వెయిటేజి ఇవ్వనున్నారు. వారు ప‌నిచేస్తున్న స‌ర్వీస్ ఆధారంగా ఏడాదికి ఒక‌టి చొప్పున ప‌దిశాతం వెయిటేజిని లెక్కిస్తారు. వీరంతా మిగిలిన అభ్యర్ధుల మాదిరిగానే రాత‌ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. రాత ప‌రీక్షల్లో ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్టుకు 12 మందిని ఎంపిక చేయ‌నున్నారు. అక‌డ‌మిక్ ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్టుకు న‌లుగురిని ఎంపిక చేసి తుది జాబితాను సిద్దం చేయ‌నున్నారు. దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలు నోటిఫికేష‌న్ లో పేర్కోనుంది ప్రభుత్వం.

వీలైనంత త్వర‌గా రిక్రూట్ మెంట్ పూర్తి చేయాల‌ని నిర్ణయం

యూనివ‌ర్శిటీల్లో ఖాళీల భ‌ర్తీని ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం న‌వంబ‌ర్ నెలాఖ‌రుకు పూర్తి చేయాల్సి ఉంది. కానీ నోటిఫికేషన్ విడుద‌ల ఆల‌స్యం కావ‌డంతో కాస్త ఆల‌స్యంగా ప్రక్రియ పూర్తి కానుంది. అయితే ఈ నియామ‌కాలు పూర్తయిన త‌ర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీల భ‌ర్తీ చేప‌ట్టే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!