ఆంధ్రప్రదేశ్ గ్రూపు-1 ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలు శుక్రవారం (జనవరి 27)న విడుదలయ్యాయి. 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేశారు. పరీక్ష నిర్వహించిన కేవలం 20 రోజుల్లోనే తొలిసారి ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన వారు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా మొత్తం 111 గ్రూప్ 1 పోస్టులకు దాదాపు 87,718 మంది అభ్యర్ధులు గ్రూపు-1 ప్రిలిమినరీ రాత పరీక్ష ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ ‘కీ’ని కూడా ఇప్పటికే ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఆన్సర్ కీపై జనవరి 11 నుంచి 13వ తేదీ వరకు అభ్యంతరాలను ఆన్‌లైన్ ద్వారా స్వీకరించింది. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఫలితాలను విడుదల చేసింది. ముందుగా ప్రకటించిన విధంగానే మూడు వారాల్లోనే కమిషన్ ఫలితాలు విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ప్రకటించిన 90 రోజుల తర్వాత మెయిన్స్ కూడా నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఏపీపీఎస్సీ ప్రకటించింది కూడా.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.