ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఏపీపీఎస్‌సీ శుభవార్త తెలిపింది. పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-4 సర్వీస్(లిమిటెడ్ రిక్రూట్‌మెంట్) కింద జూనియర్ అసిస్టెంట్/ టైపిస్ట్ ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో జూనియర్ అసిస్టెంట్(జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ విభాగం) (01), జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్(జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ విభాగం) (01), టైపిస్ట్(మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ) (01), టైపిస్ట్ (సెరికల్చర్ సర్వీస్) (01), స్టెనో/ టైపిస్ట్(గిరిజన సంక్షేమ శాఖ) (01), జూనియర్ స్టెనోగ్రాఫర్(కార్మిక శాఖ) (01) పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ, హయ్యర్ గ్రేడులో టైప్‌రైటింగ్(తెలుగు/ఇంగ్లిష్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఆఫీస్ ఆటోమేషన్‌లో నాలెడ్జ్‌తో పాటు కంప్యూటర్, అనుబంధ సాఫ్ట్‌వేర్ వినియోగంపై పరిజ్ఞానం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష(కంప్యూటర్ ఆధారిత పరీక్ష), ఆఫీస్ ఆటోమేషన్ ప్రావీణ్య పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన వారికి నెలకు రూ. 25,220 నుంచి రూ. 80,910 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 29-09-2022న మొదలై 19-10-2022తో ముగియనుంది.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..