APPSC: ఎంబీబీఎస్ చేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర వరకు జీతం పొందే అవకాశం..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) ఇటీవల వరుసగా నోటిఫికేషన్‌లు విడుదల చేస్తున్నాయి. ఏపీలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 20/2022 (లిమిటెడ్ రిక్రూట్‌మెంట్) నోటిఫికేషన్ కింద ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు...
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) ఇటీవల వరుసగా నోటిఫికేషన్‌లు విడుదల చేస్తున్నాయి. ఏపీలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 20/2022 (లిమిటెడ్ రిక్రూట్‌మెంట్) నోటిఫికేషన్ కింద ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా ఏపీ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ విభాగంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01-07-22022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యభర్థులను రాత పరీక్ష (పేపర్ – 1, పేపర్ – 2), అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన వారికి నెలకు రూ. 61,960 నుంచి రూ. 1,51,370 వరకు చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 27-10-2022 మొదలవగా, దరఖాస్తుల స్వీకరణకు 16-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..