APPSC Notification 2023: ఆంధ్రప్రదేశ్‌లో 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

|

Dec 26, 2023 | 1:55 PM

ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసులో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 9వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ..

APPSC Notification 2023: ఆంధ్రప్రదేశ్‌లో 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
APPSC
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసులో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 9వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. జనవరి 29, 2024 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

జోన్ల వారీగా ఖాళీల వివరాలు..

  • జోన్‌ 1లో ఖాళీలు: 7
  • జోన్‌ 2లో ఖాళీలు: 12
  • జోన్‌ 3లో ఖాళీలు: 8
  • జోన్‌ 4లో ఖాళీలు: 11

సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈడీ ఉత్తీర్ణతతోపాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఫస్ట్‌ లేదా సెకండ్‌ క్లాస్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 1, 2023వ తేదీ నాటికి 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. 18 యేళ్లకు తక్కువ ఉన్నవారు, 42 యేళ్లకు మించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్‌ అభ్యర్థులు రూ.370. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులు రూ.250లు చెల్లించవల్సి ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ పరీక్ష ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.61,960 నుంచి రూ.1,51,370 వరకు జీతంగా చెల్లిస్తారు.

పరీక్ష విధానం..

స్ర్కీనింగ్‌ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. 150 నిమిషాల్లో పరీక్ష రాయవల్సి ఉంటుంది. మెయిన్స్‌ పరీక్ష మొత్తం 3 పేపర్లకు ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీలో 150 ప్రశ్నలకు 150 మార్కులు, పేపర్ 2లో ఎడ్యుకేషన్‌ 1 సబ్జెక్ట్‌లో 150 ప్రశ్నలకు 150 మార్కులు, పేపర్‌ 3లో ఎడ్యుకేషన్‌ 2 సబ్జెక్టులో 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీల వివరాలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జనవరి 1, 2024.
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 29, 2024.
  • స్క్రీనింగ్ పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 13, 2024.

మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.