అమరావతి, మార్చి 23: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్ పరీక్షకు సంబంధించి ఏపీపీఎస్సీ కీలక ప్రకటన జారీ చేసింది. మరోమారు ఐచ్ఛికాల మార్పుకు అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు పరీక్ష రాసే మాధ్యమం, పోస్టులు, జోనల్ ప్రాధాన్యం, పరీక్ష కేంద్రాల మార్పులు చేర్పులకు ఏపీపీఎస్సీ మరోసారి అవకాశం కల్పించింది. ఈ మేరకు మార్చి 26 నుంచి ఏప్రిల్ 2 వరకు అధికారిక వెబ్‌సైట్‌లో సరిచేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు గ్రూప్ 1 మెయిన్ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
రాష్ట్రంలో గ్రూప్ 1 సర్వీసు 2023 పోస్టుల భర్తీకి మెయిన్స్ ఎగ్జామినేషన్ షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) తాజాగా విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 1 మెయిన్స్ మే 03 నుంచి 09 తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తన ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. గ్రూప్ 1 మెయిన్స్ మొత్తం 7 పేపర్లకు నిర్వహించనున్నారు. ఏ పరీక్ష ఏతేదీన నిర్వహిస్తారో ఆ వివరాలు ఈ కింది షెడ్యూల్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ డీఎడ్ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్), డీపీఎస్ఈ (డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి టీజీ డీఈఈసీఈటీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. 2025-2027 విద్యా సంవత్సరానికి రెండేళ్ల కోర్సులో ప్రవేశాలకు తెలంగాణ ప్రభుత్వ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 2025 మార్చి 24 నుంచి 2025 మే 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.