
అమరావతి, మే 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) పలు పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 6 నుంచి 26 మధ్య వేర్వేరు తేదీల్లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ల నియామక పరీక్షలు జరగాల్సి ఉండగా.. ఈ పరీక్షలన్నింటినీ వాయిదా వేసింది. అయితే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) మెయిన్స్ పరీక్షకు మాత్రం ఎలాంటి అడ్డులేకపోవడంతో ఈ పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఈ పరీక్ష హాల్‌టికెట్స్‌ను కూడా విడుదల చేసింది.
అభ్యర్థులు తమ ఓటీపీఆర్ ఐడీ, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌంన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ పరీక్షలు జూన్ 2 నుంచి 4వ తేదీ వరకు ఓఎంఆర్ ఆధారంగా ఆఫ్‌లైన్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనుంది. కాగా గత ఏడాది 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది.
ఏపీపీఎస్సీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మెయిన్స్ హాల్‌టికెట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ కోర్సులో ప్రవేశాలకు టీజీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్) 2025 ప్రవేశ పరీక్ష జూన్ 1న నిర్వహించనుంది. ఈ పరీక్ష హాల్‌టికెట్లు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు పరీక్ష హాల్ టికెట్లను తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జూన్ 1న ఈ పరీక్ష రెండు సెషన్లలో జరగనుంది. మొదటి సెషన్ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2 గంటల నుంచి 4 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్ష జరగనుంది.
తెలంగాణ ఎడ్‌సెట్ 2025 హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.