ఆంధ్రప్రదేశ్‌లో ఎండోమెంట్స్ సబ్ సర్వీసులో 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) గ్రేడ్-3 పోస్టుల భర్తీకి సంబంధించి తుది ఫలితాలు గురువారం (మే 11) విడుదలయ్యాయి. మొత్తం 59 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఎంపికైనవారి వివరాలు వెబ్‌సైట్‌లో విడుదల చేశారు.
కాగా ఫిబ్రవరి 17న ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో రాష్ట్రవ్యాప్తంగా మెయన్స్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్ 26, మే 8 తేదీల్లో విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేసన్ నిర్వహించారు. అనంతరం ఎంపికైన వారి వివరాలను తెలియజేస్తూ తుది ఫలితాలను కమిషన్ ప్రకటించింది. మెరిట్ లిస్ట్‌ను ఈ కింద ఇచ్చిన లింక్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఏపీపీఎస్సీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) గ్రేడ్-3 మెరిట్ లిస్ట్ క్లిక్ క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.