
పేదింటి విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం Telangana Overseas Scholarship పథకం అమలు చేస్తోంది. అల్ప సంఖ్యాకులు, షెడ్యూల్డు కులాలు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రతిభ కలిగిన వారికి పేదరికం అడ్డు కారాదన్న ఉద్దేశంతో విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ పథకం అవసరమైన ఆర్ధిక బరోసా అందిస్తంఉది. అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడానికి ప్రకటన వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ వంటి షెడ్యూల్డు కులాలు, మైనార్టీల్లో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కు, జైన, భౌద్ద, పార్శీలు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే వయసు తప్పనిసరిగా 35 ఏళ్లకు మించరాదు. అలాగే అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, కెనడా, సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్‌లోని గుర్తింపు పొందిన వర్సిటీల్లో 1 జులై 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు పోస్టు గ్రాడ్యుయేట్ లేదా పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొంది ఉండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు మాత్రమే ఉండాలి. డిగ్రీ, ఇంజినీరింగ్‌లో అత్యున్నత ప్రతిభకనబరచి ఉండాలి.
ఈ అర్హతలు ఉన్నవారు తెలంగాణ ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్ ఆఫ్ స్కాలర్షిప్స్ (తెలంగాణ ఈ-పాస్) వెబ్‌సైబ్ ద్వారా జనవరి 20, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం దరఖాస్తు చేసిన హార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకుని ఆయా సంక్షేమ శాఖల అధికారులకు అందించాలి. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ సర్టిపికెట్లు, ఆదాయ, నివాస, కుల ధ్రవీకరణ పత్రాలను దరఖాస్తుతోపాటు సమర్పించాలి. వీటితోపాటు పాస్‌పోర్టు, వీసా, అడ్మిషన్ పొందినట్లు ధృవీకరించే ప్రతి జీఆర్‌ఈ, జీమాట్, టోఫెల్, ఈఎస్‌ఎల్‌టీసీ అర్హత పత్రం, బ్యాంక్ ఖాతా వివరాలు కూడా అందించాలి.
తెలంగాణ ఈపాస్ స్కాలర్‌షిప్ ఆన్ లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.