Tspsc Guidelines RIMC: ఆర్మీ స్కూల్ లో చదువుకోవాలనుకునే బాలికల కోసం నోటిఫికేషన్ రిలీజ్.. మరిన్ని వివరాల కోసం

|

Oct 22, 2021 | 1:10 PM

Tspsc Guidelines RIMC: ఆర్మీ స్కూల్ లో చదివించాలని కోరుకునే బాలికలకు గుడ్ న్యూస్.. డెహ్రాడూన్ లోని రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజ్ లో బాలికల ప్రవేశం కోసం నోటిఫికేషన్..

Tspsc Guidelines RIMC: ఆర్మీ స్కూల్ లో చదువుకోవాలనుకునే బాలికల కోసం నోటిఫికేషన్ రిలీజ్.. మరిన్ని వివరాల కోసం
Rashtriya Indian Military C
Follow us on

Tspsc Guidelines RIMC: ఆర్మీ స్కూల్ లో చదివించాలని కోరుకునే బాలికలకు గుడ్ న్యూస్.. డెహ్రాడూన్ లోని రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజ్ లో బాలికల ప్రవేశం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 7వ తరగతి పాస్ అయిన విద్యర్దినిలు ఎనిమిదో తరగతి ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తి ఉన్న విద్యర్దినిలు RIMC వెబ్ పోర్టల్లో దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ సహా ప్రాస్పెక్టస్, ఓల్డ్ మోడల్ పేపర్స్ ఉన్నబుక్ లెట్ పొందవచ్చు. ఇదే విషయంపై టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ స్పందిస్తూ.. అధికారిక వెబ్ సైట్ tspsc.gov.in, rimc.gov.in ను సదర్శించావచ్చని తెలిపారు. తెలంగాణకు చెందిన బాలికలు తమ అప్లికేషన్ ఫార్మ్స్ ను నవంబరు 15లోగా టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి పంపించాలన్నారు. హైదరాబాద్‌లో డిసెంబరు 18న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నామని చెప్పారు.
తెలంగాణ బాలికలు దరఖాస్తులు చేస్తుకోవాల్సిన విధానం:

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2022 జూలై 1 నాటికి సేవంత్ పాస్ అయ్యి ఉండాలి.
వయసు: 2009 జూలై 2 కంటే ముందు.. 2011 జనవరి 1 తర్వాత జన్మించి ఉండకూడదు.
దరఖాస్తు ఫీజు- జనరల్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు రూ.555

ఎంట్రెన్స్ ఎగ్జామ్:

ఈ పరీక్షలు మొత్తం మార్కులు 400 నిర్వహిస్తారు. నాలుగు పేపర్లు ఉంటాయి. ఇంగ్లీష్ కు 125, మ్యాథ్స్ కి 200, జనరల్ నాలెడ్జ్ 75 మార్కులు కేటాయించారు. మ్యాథ్స్ పేపర్ కు గంటన్నర, జీకేకి గంట , ఇంగ్లీష్ పేపర్ కి రెండు గంటల సమయం ఇస్తారు.
ఇంగ్లీష్ మినహా మిగిలిన రెండు పేపర్లను హిందీ లేదా ఇంగ్లీష్ మీడియంలో రాసేవీలుంది.
ఎంపిక కోసం :
ప్రతి పేపర్లో కనీసం 50శాతం మార్కులు సాధించాలి.
ఎంట్రన్స్ లో అర్హత పొందిన బాలికలకు తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎంట్రెన్స్ టెస్ట్, వైవాలో సాధించిన మెరిట్ ఆధారంగా అడ్మిషన్ ప్రక్రియ చేపడతారు.
దరఖాస్తులను పంపించాల్సిన చిరునామా:
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
ప్రతిభ భవన్
ఎంజే రోడ్
నాంపల్లి
హైదరాబాద్

Also Read:  సముద్ర గర్భంలో ఏలియన్స్ రూపంలో లార్వాలు .. మరింత పరిశోధనలు చేస్తామంటున్న శాస్త్రజ్ఞులు