AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP TET Free Coaching 2025: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా ‘టెట్‌’ కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానం

AP TET 2025 Free coaching for minorities: టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) 2025 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి టెట్ పరీక్షకు రెగ్యులర్‌ అభ్యర్థులతో పాటు ఇన్‌ సర్వీస్‌ టీచర్లు కూడ పోటీ పడుతున్నారు. అక్టోబర్ 24 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమవగా.. నవంబర్‌ 23 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అయితే టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల కోసం..

AP TET Free Coaching 2025: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా ‘టెట్‌’ కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానం
AP TET Free Coaching
Srilakshmi C
|

Updated on: Nov 02, 2025 | 6:59 AM

Share

అమరావతి, నవంబర్‌ 2: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) 2025 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి టెట్ పరీక్షకు రెగ్యులర్‌ అభ్యర్థులతో పాటు ఇన్‌ సర్వీస్‌ టీచర్లు కూడ పోటీ పడుతున్నారు. అక్టోబర్ 24 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమవగా.. నవంబర్‌ 23 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. నవంబర్‌ 25న ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌ నిర్వహిస్తారని, డిసెంబర్‌ 3 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. ఇక టెట్‌ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్‌ 10న 2 షిఫ్టుల్లో ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. ఈ క్రమంలో మైనారిటీ అభ్యర్థులకు ‘టెట్‌’ పరీక్షకు ఉచితంగా కోచింగ్‌ ఇవ్వనున్నట్లు ఆ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తాజాగా ప్రకటనలో వెల్లడించారు. నవంబర్‌ మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, కోచింగ్‌ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ రెండు విధానాల్లోనూ అందిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ మైనారిటీస్‌ (సీఈడీఎం) వెబ్‌సైట్‌ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లకూ టెట్‌ అర్హత ఉండాల్సిందే: తెలంగాణ హైకోర్టు

ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల పాఠశాలల్లో(భవితా కేంద్రాలు) స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లకు సైతం టెట్‌ (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) అర్హత ఉండాల్సిందేనని హైకోర్టు అక్టోబరు 31న స్పష్టం చేసింది. ఈ మేరకు తీర్పు వెలువరించింది. సెకండరీ గ్రేడ్‌ టీచర్, స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్ల కేడర్లలోని స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్ల నియామకాలకు టెట్‌ అర్హత నుంచి మినహాయింపు ఇవ్వాలని పలువురు వేర్వేరుగా హైకోర్టులో 3 పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఆర్‌సీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక టీచర్లకు కూడా టెట్‌ అర్హతను నిర్దేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 4 రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనికి కౌంటర్‌గా ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్‌సీటీఈ ప్రకారం ప్రత్యేక టీచర్లకు టెట్‌ ఉండాల్సిందేనని, వారికి మినహాయింపు ఇవ్వడం కుదరదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌లను కొట్టివేసింది. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు కూడా టెట్‌లో అర్హత సాధించాల్సిందేనని తీర్పు ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా