కరోనా మహమ్మారి ప్రభావంతో కుదేలైపోయిన అన్ని రంగాలు మళ్లీ ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. మునపటిలాగానే పూర్తి స్థాయిలో తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇందుకోసం ఉద్యోగుల సంఖ్యను కూడా పెంచుకోవాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్, ఐటీ దిగ్గజ సంస్థ యాపిల్ బీటెక్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగా హైదరాబాద్, బెంగళూరుతో పాటు పలు నగరాల్లో వివిధ పోస్టుల కోసం ఇంజినీరింగ్ అభ్యర్థులను నియమించుకోనున్నట్లు తెలిపింది. అదేవిధంగా ఫ్రెషర్స్ కోసం ఇంటర్న్ అవకాశాలను కూడా కల్పిస్తున్నట్లు పేర్కొంది.
ఫ్రెషర్లకు ఇంటర్న్ అవకాశాలు
ప్రపంచంలో యాపిల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి. ఇక్కడ ఐఫోన్‌లను కూడా తయారుచేస్తున్నారు. ఇక హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో యాపిల్ డెవలపింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఫుల్ స్టాక్ డెవలపర్, నెట్‌వర్క్ సెక్యూరిటీ ఇంజినీర్, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(డేటా ప్లాట్‌ఫార్మ్) తదితర పోస్టుల కోసం ఇంజినీరింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నాయి. ఈ రంగానికి సంబంధించి ఇప్పటికే అనుభవం ఉండి వివిధ సంస్థల్లో పనిచేస్తూ మార్పు కోరుకునేవారికి, ఇప్పుడిప్పుడే బీటెక్ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లకు ఇది మంచి అవకాశం. ఎంపికైన ఉద్యోగులు హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో పనిచేయాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు నేరుగా యాపిల్ కెరీర్ పోర్టల్‌లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.
Also Read: Gol gappas in leaf: విస్తరాకుల్లో పానీపూరి విక్రయం…సూపర్బ్ కాన్సెప్ట్ అంటోన్న నెటిజన్లు
Corona Virus: డ్రాగన్ కంట్రీలో పడగ విప్పుతున్న కరోనా.. లైవ్ వీడియో
Electric Scooters: కేవలం రూ.40 వేలకే ఎలక్ట్రిక్ వాహనం.. అత్యాధునిక టెక్నాలజీతో తయారీ..!