ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా 2023-24 విద్యాసంవత్సారానికి టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలయింది. వివిధ కారణాలతో పాఠశాల, కాలేజీకి దూరంగా ఉండటంతో పాటు వయసు దాటిపోయిన వారికి చదువుకునేందుకు ఓపెన్ స్కూల్ సొసైటీ అవకాశం కల్పిస్తుంది. సాధారణంగా స్కూల్ లేదా కాలేజీకి వెళ్లాలంటే నిర్ధిష్ట వయసు ఉంటుంది. ఆ వయసును బట్టి మాత్రమే రెగ్యులర్ గా వెళ్లి చదువుకునే చాన్స్ ఉంటుంది.
అలా వీలుకాని15 ఏళ్లు నిండిన వారికి ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్ లేదా ఇంటర్ అడ్మిషన్ తీసుకుని పరీక్షలకు హాజరుకావచ్చు. ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకూ ఇలా చదవాలనుకునే వారికి అడ్మిషన్ తీసుకునే అవకాశం కల్పించింది. ఆన్ లైన్ ద్వారా అడ్మిషన్ తీసుకోవచ్చని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. ఒకసారి అడ్మిషన్ తీసుకుంటే ఐదేళ్ల వరకూ పరీక్షలు రాసుకునే అవకాశం ఉంటుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.