APOSS SSC and Inter Results 2024: ఆంధ్రప్రదేశ్ ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

|

Apr 26, 2024 | 7:00 AM

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం 2023-24 విద్యా సంవత్సరానికి గానూ పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు సార్వత్రిక విద్యాపీఠం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన పరీక్షలకు హాజరైన విద్యార్ధులు ఏపీ ఓపెన్‌ స్కూల్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చని తెలిపారు. మార్కుల మెమోలను సంబంధిత స్టడీ కేంద్రాల్లో..

APOSS SSC and Inter Results 2024: ఆంధ్రప్రదేశ్ ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి
APOSS SSC and Inter Results
Follow us on

అమరావతి, ఏప్రిల్ 26: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం 2023-24 విద్యా సంవత్సరానికి గానూ పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు సార్వత్రిక విద్యాపీఠం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన పరీక్షలకు హాజరైన విద్యార్ధులు ఏపీ ఓపెన్‌ స్కూల్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చని తెలిపారు. మార్కుల మెమోలను సంబంధిత స్టడీ కేంద్రాల్లో తీసుకోవచ్చని తెలిపారు.

కాగా ఏడాది ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 32,581 మంది హాజరుకాగా.. ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 73,550 మంది విద్యార్థులు హాజరయ్యారు. తాజా ఫలితాల్లో ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతిలో 18,185 మంది అంటే 55.81 శాతం ఉత్తీర్ణత పొందారు. ఇంటర్‌లో 48,377 మంది అంటే 65.77 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. 

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఇంటర్‌  2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

 ‘టీఎస్‌ఈ సెట్‌ను మే చివరి వారానికి వాయిదా వేయాలి’.. అభ్యర్థుల వినతి

తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ఈసెట్‌ 2024) మే 6వ తేదీన జరగనున్నసంగతి తెలిసిందే. ఈ పరీక్షను మే నెల చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ మేరకు వారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు. ఈ నెల 24వ తేదీన సీఎస్‌ను కలిసి వారు వినతిపత్రం అందజేశారు. పాలిటెక్నిక్‌ చివరి పరీక్ష ఏప్రిల్‌ 30న జరగనుంది. ఆ తర్వాత కేవలం 6 రోజులకే ఈసెట్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. అందువల్ల తాము పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేకపోతున్నామని ఈ సందర్భంగా వాపోయారు. ఈసెట్‌ పరీక్షకు కనీసం 4 వారాల గడువైనా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.