AP TET 2024 Result Date: ఏపీ టెట్‌ ఫలితాలపై సందిగ్ధత..  రేపట్నుంచి డీఎస్సీ పరీక్ష కేంద్రాల ఎంపికకు ఆప్షన్లు

|

Mar 19, 2024 | 10:27 AM

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పరీక్ష ఫలితాలను ఇంకా విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే టెట్‌ తుది ‘కీ’లను ప్రకటించిన ప్రభుత్వం ఫలితాల ప్రకటనపై మాత్రం జాప్యం చేస్తోంది. మరోవైపు డీఎస్సీ పరీక్షలు సమీపిస్తున్నాయి. డీఎస్సీ పరీక్షలు రాసేందుకు టెట్‌ మార్కులు కీలకం. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్‌లో అర్హత సాధించిన వారు మాత్రమే డీఎస్సీ రాసేందుకు..

AP TET 2024 Result Date: ఏపీ టెట్‌ ఫలితాలపై సందిగ్ధత..  రేపట్నుంచి డీఎస్సీ పరీక్ష కేంద్రాల ఎంపికకు ఆప్షన్లు
AP TET 2024 Result
Follow us on

అమరావతి, మార్చి 19: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పరీక్ష ఫలితాలను ఇంకా విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే టెట్‌ తుది ‘కీ’లను ప్రకటించిన ప్రభుత్వం ఫలితాల ప్రకటనపై మాత్రం జాప్యం చేస్తోంది. మరోవైపు డీఎస్సీ పరీక్షలు సమీపిస్తున్నాయి. డీఎస్సీ పరీక్షలు రాసేందుకు టెట్‌ మార్కులు కీలకం. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్‌లో అర్హత సాధించిన వారు మాత్రమే డీఎస్సీ రాసేందుకు అర్హులు అవుతారు.

విద్యాశాఖ మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. మార్చి 14న ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఫలితాల విడుదలపై స్పష్టత రాలేదు. టెట్‌ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించినందున నార్మలైజేషన్‌ చేయాల్సి ఉంటుంది. టెట్‌ పరీక్షలను అందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా నిర్వహించారు. దీంతో ఒకసారి ప్రశ్నపత్రం కఠినంగా వస్తే, మరోసారి తేలికగా వచ్చే అవకాశం ఉంది. దీంతో మార్కులను నార్మలైజేషన్‌ చేసి, మార్కుల్లో మార్పులు చేర్పులు చేస్తారు. దీంతో మార్కుల్లో కొంత వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంది. వీటన్నింటి దృష్ట్యా ప్రభుత్వం టెట్‌ ఫలితాలు జారీ చేయనందువల్ల డీఎస్సీ సన్నద్ధతపై అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో డీఎస్సీ షెడ్యూల్‌ను ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే. కొత్త షెడ్యూల్‌ ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకు ఆన్‌లైన్‌లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు వెబ్‌ ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. ఇక మార్చి 25 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని షెడ్యూల్‌లో విద్యాశాఖ పేర్కొంది. అయితే టెట్ ఫలితాలు వెలువడక పోవడంతో.. తాము డీఎస్సీకి సన్నద్ధ మవ్వాలో లేదో తెలియక అభ్యర్ధులు తికమక పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.