AP TET Answer Key 2022 release date: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET 2022) పరీక్షలు ముగిశాయి. ఆగస్టు 6 నుంచి ప్రారంభమైన ఏపీ టెట్ పరీక్షలు ఆగస్టు 21వరకు జరిగాయి. ఈ పరీక్షకు మొత్తం 5,25,789 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్ నిర్వహణకు దాదాపు150 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఏపీతో పాటు ఒడిశా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ల్లో కూడా ఈ సారి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2018 తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు టెట్ నిర్వహించడంతో భారీగా అభ్యర్ధులు పరీక్షకు హాజరయ్యారు. తాజా టెట్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ ఈ నెలాఖరున అంటే ఆగస్టు 31వ తేదీన విడుదలకానుంది. సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు ఆన్సర్ కీ పై అభ్యంతరాలు లేవనెత్తవచ్చు. తుది ఆన్సర్ కీ సెప్టెంబర్ 12న విడుదలవుతుంది. ఇక ఏపీ టెట్ 2022 ఫలితాలు సెప్టెంబర్ 14న ప్రకటించనున్నారు. ఇతర తాజా అప్‌డేట్ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.