AP 10th Results: టెన్త్ ఫలితాలు అప్పుడే.. అధికారిక ప్రకటన చేసిన SSC బోర్డు

ఎప్పుడెప్పుడు రిజల్ట్స్ ప్రకటిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్టూడెంట్స్‌కు అలెర్ట్. బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. ఫలితాల ప్రకటన తేదీని అధికారికంగా వెల్లడించారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

AP 10th Results: టెన్త్ ఫలితాలు అప్పుడే.. అధికారిక ప్రకటన చేసిన SSC బోర్డు
Andhra Tenth Results

Edited By: TV9 Telugu

Updated on: Apr 22, 2024 | 11:39 AM

ఏపీ టెన్త్ విద్యార్ధులకు పాఠశాల విద్యాశాఖ శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించిన పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్‌ 22, సోమవారం విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఉదయం 11 గంటలకు ఫలితాలను విజయవాడలోని తాజ్ హోటల్‌లో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేయనున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం స్టూడెంట్స్ తమ హాల్‌టికెట్‌ నంబర్ ఎంటర్ చేసి ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు.  అలానే టీవీ9 వెబ్ సైట్‌లో కూడా క్షణాల వ్యవధిలో ఫలితాలను తెలుసుకోవచ్చు.  దీంతో పాటు పదో తరగతి మార్కుల మెమోను  స్టూడెంట్స్ చెక్ చేసి, డౌన్ లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాష్ట్రంలో మార్చి18 నుంచి మార్చి 30 వరకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరిగాయి. 6,30,633 మంది స్టూడెంట్స్ ఈ పరీక్షలు రాశారు. పరీక్షలు ముగిసిన వెంటనే అధికారులు మూల్యాంకనం ప్రారంభించి ఈ నెల 8 తేదీతో కంప్లీట్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…