AP 10th Class Results 2025 Today: మరికాసేపట్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది విద్యార్ధుల నిరీక్షణకు మరికాసేపట్లో తెరపడనుంది. బుధవారం (ఏప్రిల్ 23) ఉదయం 10 గంటలకు ఫలితాలు వెల్లడికానున్నాయి. రిజల్ట్స్‌ వచ్చాక ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోండి..

AP 10th Class Results 2025 Today: మరికాసేపట్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే
Andhra Pradesh 10th Class Results

Updated on: Apr 23, 2025 | 10:17 AM

అమరావతి, ఏప్రిల్‌ 23: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్‌ 23) విడుదలకానున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులురెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతోపాటు ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి, ఇంటర్‌ ఫలితాలను సైతం ఈ రోజు ప్రకటించనున్నారు. ఫలితాల కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లోనూ చెక్‌ చేసుకోవచ్చు.

ఏపీ పదో తరగతి 2025 పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు

ఇక ఓపెన్‌ స్కూల్‌ టెన్త్, ఇంటర్‌ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. అలాగే మన మిత్ర వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు ‘హాయ్‌’ అని మెసేజ్‌ పంపి విద్యాసేవల్లో ఎస్‌ఎస్‌సీ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలపై క్లిక్‌ చేసి హాల్‌ టికెట్ నెంబర్‌ ఎంటర్‌ చేస్తే.. ఫలితాలు క్షణాలు స్క్రీన్‌ పై పీడీఎఫ్‌ రూపంలో కనిపిస్తాయి. అలాగే లీప్‌ (ఎల్‌ఈఏపీ) మొబైల్‌ యాప్‌లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి.

ఇవి కూడా చదవండి

కాగా రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం ఏప్రిల్ 3 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవగా ఏప్రిల్ 9వ తేదీతో ముగిసింది. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6,49,884 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్మీడియట్‌ పరీక్షలు కూడా మార్చి 17 నుంచి మార్చి 28 వరకు జరిగాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.