ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ సెట్)-2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది కూడా ఆంధ్రా యూనివర్సిటీ సెట్ పరీక్షను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు ప్రతీయేట రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సెట్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలు ఆంధ్రా యూనివర్సిటీ చూస్తోంది. జనరల్ స్టడీస్‌తోపాటు 30 సబ్జెక్టుల్లో ఏపీ సెట్ పరీక్ష నిర్వహిస్తారు. సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. గరిష్ఠ వయోపరిమితి అంటూ ఏమీ ఉండదు.
పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. ఒకటే రోజున రెండు పేపర్లకు పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయిస్తారు. పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. మూడు గంటల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన అభ్యర్ధులు రూ.1200, బీసీ కేటగిరీకి చెందిన వారు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ట్రాన్స్‌జెండర్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.700ల చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.