AP RGUKT Admissions 2024: జులై 11న ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు జనరల్‌ కౌన్సెలింగ్‌ సెలక్షన్‌ లిస్ట్‌ విడుదల.. ధ్రువపత్రాల పరిశీలన తేదీలివే!

|

Jul 07, 2024 | 3:55 PM

ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లలో 2024-25 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన జులై 4తో ముగిసింది. క్యాంపస్‌ల వారీగా జనరల్‌ కౌన్సెలింగ్‌కు ఎంపికైన విద్యార్థుల తుది జాబితా జులై 11న విడుదల చేయనున్నట్లు ట్రిపుల్‌ ఐటీల ప్రవేశాల కో ఆర్డినేటర్‌..

AP RGUKT Admissions 2024: జులై 11న ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు జనరల్‌ కౌన్సెలింగ్‌ సెలక్షన్‌ లిస్ట్‌ విడుదల.. ధ్రువపత్రాల పరిశీలన తేదీలివే!
AP RGUKT Admissions 2024
Follow us on

నూజివీడు, జులై 7: ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లలో 2024-25 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన జులై 4తో ముగిసింది. క్యాంపస్‌ల వారీగా జనరల్‌ కౌన్సెలింగ్‌కు ఎంపికైన విద్యార్థుల తుది జాబితా జులై 11న విడుదల చేయనున్నట్లు ట్రిపుల్‌ ఐటీల ప్రవేశాల కో ఆర్డినేటర్‌ ఎస్‌ అమరేంద్రకుమార్‌ తెలిపారు. ఇప్పటి వరకు ఎన్‌సీసీ విభాగంలో 1141, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విభాగంలో 162, క్యాప్‌ విభాగంలో 167, దివ్యాంగుల విభాగంలో 249, క్రీడా విభాగంలో 796 మంది విద్యార్థుల దరఖాస్తులను పరిశీలించినట్లు ఆయన వివరించారు. జులై మూడో వారం నుంచి నాలుగు క్యాంపస్‌లలో తరగతులు ప్రారంభం అవుతాయి.

ఎంపికైన విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ఏయే తేదీల్లో ఉంటుందంటే..

  • నూజివీడు క్యాంపస్‌లో జులై 22, 23 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
  • ఇడుపులపాయ క్యాంపస్‌లో జులై 22, 23 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది
  • ఒంగోలు క్యాంపస్‌లో జులై 24, 25 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
  • శ్రీకాకుళం క్యాంపస్‌లో జులై 26, 27 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.

నేటి నుంచి తెలంగాణ పాలిసెట్‌ 2024 తుది విడత కౌన్సెలింగ్‌

తెలంగాణ పాలిసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ ఆదివారం (జులై 7) నుంచి ప్రారంమైంది. నేటి నుంచి జులై 8వ తేదీ వరకు ఫీజు చెల్లించి, ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు. వారికి జులై 9న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. వీరంతా జులై 9, 10 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవల్సి ఉంటుంది. జులై 13వ తేదీన సీట్లు కేటాయింపు ఉంటుందని పాలిసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ శ్రీదేవసేన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.