AP language Pandit Entrance Test 2021: ఆంధ్రప్రదేశ్‌లోని లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ కాలేజీల్లో 2021-22 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం వచ్చే నెల 25న ఏపీఎల్‌పీ సెట్ (లాంగ్వేజ్ పండిట్ కామన్ కంప్యూటర్ బేస్డ్ ఎంట్రన్స్ టెస్ట్) నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఏడాది కాలవ్యవధికి సంబంధించిన కోర్సులకు సంబంధించి ప్రవేశ పరీక్షకు ఈనెల 18వ తేదీ నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎల్‌పీసెట్-2021 కన్వీనర్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ నెల 18 నుంచి వచ్చే నెల 16 వరకు అభ్యర్థులు పరీక్ష రుసుము రూ.600 చెల్లించి.. 17 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులంతా అధికార వెబ్‌సైట్ http://aplpcet.apcfss.in, https://cse.ap.gov.in/dsenew/ లో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. కాగా.. భౌతిక దరఖాస్తులను అంగీకరించబోమని స్పష్టంచేశారు.
అర్హత, నియమావళి, ఆన్‌లైన్ దరఖాస్తు నియమాలు, పరీక్ష నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు, ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో ఈ నెల 16 నుంచి చూసుకొవచ్చని సూచించారు. భాషా పండితుల శిక్షణా కోర్సుల్లో చేరే అభ్యర్థులు ఆయా.. లాంగ్వేజెస్‌లో ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
Also Read: