KGBV Non Teaching Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 729 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎలాంటి రాతపరీక్ష లేదు

|

Oct 06, 2024 | 3:09 PM

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(KGBV)ల్లో 2024-25 విద్యా సంవత్సరం (ఏడాది) కాలానికి ఖాళీగా ఉన్న 729 బోధనేతర పోస్టులను ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీడీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్ధులు అక్టోబరు 7 నుంచి 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆసక్తిగల..

KGBV Non Teaching Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 729 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎలాంటి రాతపరీక్ష లేదు
KGBV Non Teaching Jobs
Follow us on

అమరావతి, అక్టోబర్ 6: ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(KGBV)ల్లో 2024-25 విద్యా సంవత్సరం (ఏడాది) కాలానికి ఖాళీగా ఉన్న 729 బోధనేతర పోస్టులను ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీడీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్ధులు అక్టోబరు 7 నుంచి 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు నింపిన దరఖాస్తులను మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. మొత్తం పోస్టుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టైప్‌-3 కేజీబీవీల్లో 547 పోస్టులు, టైప్‌-4లో 182 పోస్టులు భర్తీ చేయనున్నారు. టైప్‌-3లో హెడ్‌ కుక్‌ పోస్టులు 48, అసిస్టెంట్‌ కుక్‌ పోస్టులు 263, వాచ్‌ ఉమెన్‌ పోస్టులు 95, స్కావెంజర్‌ పోస్టులు 79, స్వీపర్‌ పోస్టులు 62 వరకు ఉన్నాయి. టైప్‌ 4లో హెడ్‌కుక్‌ పోస్టులు 48, అసిస్టెంట్‌ కుక్‌ పోస్టులు 76, చౌకీదార్‌ 58 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ తాజా నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నారు. ఆయా మండలాల్లో స్వీకరించిన దరఖాస్తులను ఈ నెల 17న జిల్లా కార్యాలయాలకు పంపిస్తారు. కాగా ఇటీవల 604 బోధనా, బోధనేతర సిబ్బందిని ఒప్పంద, ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఐబీపీఎస్‌ క్లర్క్స్‌ పోస్టులకు అక్టోబర్‌ 13న మెయిన్స్‌ రాత పరీక్ష.. వెబ్‌సైట్లో అడ్మిట్‌కార్డులు

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్‌ పోస్టుల భర్తీకి సంబంధించి మెయిన్స్‌ పరీక్ష అక్టోబర్‌ 13వ తేదీన జరగనుంది. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను ఐబీపీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు పరీక్ష కేంద్రాల్లో అక్టోబర్‌ 13వ తేదీన మెయిన్స్‌ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. ప్రిలిమిన‌రీ పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ‌వ్యాప్తంగా మొత్తం 6,128 క్లర్క్ పోస్టును భ‌ర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.

ఐబీపీఎస్‌ క్లర్క్స్‌ మెయిన్స్‌ అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్‌ చేయండి. 

అక్టోబరు 7 నుంచి డిగ్రీ ప్రవేశాలకు స్పాట్‌ అడ్మిషన్లు

విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి డిగ్రీ మొదటి ఏడాది ప్రవేశం కోసం అర్హులైన అభ్యరులకు చివరి అవకాశంగా స్పాట్‌ అడ్మిషన్లు అక్టోబరు 7 నుంచి 9 వరకు జరుగుతాయని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఆర్‌.మంజుల తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏలలో చేరడానికి ఆన్‌లైన్‌లో సీటురాని, చేరలేని విద్యారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.