AP Inter: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీ వచ్చేసింది.. అధికారికంగా ప్రకటించిన విద్యాశాఖ.

|

Apr 27, 2023 | 7:13 PM

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ పరీక్షా ఫలితాలను విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకేసారి ఫస్ట్‌ ఇయర్‌తో పాటు, సెకండ్ ఇయర్‌ ఫలితాలను రిలీజ్‌ చేశారు. ఇంటర్‌ పరీక్షల్లో 4 లక్షల 84వేల మంది విద్యార్థులు ఇంటర్‌ ఫస్టియర్‌ ఎగ్జామ్స్‌, 5లక్షల 19వేల మంది విద్యార్థులు...

AP Inter: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీ వచ్చేసింది.. అధికారికంగా ప్రకటించిన విద్యాశాఖ.
AP INTER
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ పరీక్షా ఫలితాలను విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకేసారి ఫస్ట్‌ ఇయర్‌తో పాటు, సెకండ్ ఇయర్‌ ఫలితాలను రిలీజ్‌ చేశారు. ఇంటర్‌ పరీక్షల్లో 4 లక్షల 84వేల మంది విద్యార్థులు ఇంటర్‌ ఫస్టియర్‌ ఎగ్జామ్స్‌, 5లక్షల 19వేల మంది విద్యార్థులు ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఎగ్జామ్స్‌ హాజరయ్యారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 61 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 2,66,322 మంది పాస్‌ అయ్యారు. సెకండ్‌ ఇయర్‌ విషయానికొస్తే మొత్తం 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో బాలికలు 65 శాతం, 58 బాలురు పాస్‌ అయ్యారు. సెకండ్‌ ఇయర్‌లో బాలికలు 75 శాతం మంది బాలికలు, 68 శాతం మంది బాలురు పాస్‌ అయ్యారు. మొత్తం మీద ఇంటర్‌ రిజల్ట్స్‌లో బాలికలదే పైచేయి.

ఇదిలా ఉంటే ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఏపీ విద్యా శాఖ కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగానే గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ సప్లీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారు. అడ్వాన్స్‌ సప్లిమెంటరీకి ఫీజు చెల్లించడానికి మే 3వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..