ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్టులో.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/ట్రాన్ఫర్ ప్రాతిపదికన 31 సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ 26, ట్రాన్ఫర్ కింద 5 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు లా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా సెక్షన్ ఆఫీసర్/కోర్ట్ ఆఫీసర్/సెక్యురిటీ ఆఫీసర్/అసిస్టెంట్ లైబ్రేరియన్ తదితర సెక్షన్‌లలో ఇప్పటికే సభ్యుడిగా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు నవంబర్ 1, 2022వ తేదీ నాటికి 35 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 8, 2022వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది. జనరల్ అభ్యర్ధులు రూ.1500లు, ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులు రూ.750లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.77,840ల నుంచి రూ.1,36,520ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.