AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt Schools: ఇక సర్కార్‌ బడుల్లో రద్దీకి చెక్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన కూటమి ప్రభుత్వం

భుత్వ ఉన్నత పాఠశాలల్లో తరగతికి 50 మంది విద్యార్థులకుపైగా ఉంటే రెండో సెక్షన్‌ ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ మేరకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన జీఓ మేరకు తరగతి గదిలో విద్యార్ధుల సంఖ్య 54కి మించితే రెండో సెక్షన్‌ ఏర్పాటు చేయాలని పేర్కొంది.

Govt Schools: ఇక సర్కార్‌ బడుల్లో రద్దీకి చెక్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన కూటమి ప్రభుత్వం
Govt High School Students
Srilakshmi C
|

Updated on: Aug 04, 2025 | 6:06 AM

Share

అమరావతి, ఆగస్టు 4: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సంబంధించి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలల్లో తరగతికి 50 మంది విద్యార్థులకుపైగా ఉంటే రెండో సెక్షన్‌ ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ మేరకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన జీఓ మేరకు తరగతి గదిలో విద్యార్ధుల సంఖ్య 54కి మించితే రెండో సెక్షన్‌ ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ జీవోకి సవరణ చేస్తూ ఆ సంఖ్యను 50కి కుదించింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ప్రతి తరగతిలో 40 మంది విద్యార్థులకు అదనపు సెక్షన్‌ మంజూరు చేయనున్నారు.

ఇటీవల ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, సర్దుబాటు, పదోన్నతులు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీ మేరకు జీఓ ఇవ్వకుండానే ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో రాష్ట్రంలోని దాదాపు 25 వేల మంది టీచర్లకు జీతాల సమస్య వచ్చిపడింది. దీంతో సెక్షన్లు, టీచర్ల కేటాయింపుపై ప్రభుత్వం క్లారిటీ ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా ఉత్తర్వుల మేరకు ఫౌండేషనల్‌ పాఠశాలల్లో 20 మంది వరకు విద్యార్ధులకు ఒక ఎస్జీటీ టీచర్, 21 నుంచి 60 వరకు విద్యార్ధులుంటే ఇద్దరు ఎస్జీటీ టీచర్లను నియమిస్తారు. ఇక ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో 121 నుంచి 150 మధ్య విద్యార్థులు ఉంటే మిగులు అదనంగా మరో ఎస్జీటీని కేటాయిస్తారు. పాఠశాల విద్యలో ఖాళీగా ఉన్న 1221 పోస్టులను రద్దు చేసి, ఆయా ప్రాంతాల్లో అవసరాల మేరకు కొత్తగా 1,901 పోస్టులను సృష్టించారు. పదోన్నతులు, హేతుబద్ధీకరణ తర్వాత 1,995 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్కతేలింది. ఇందులో ప్రధానోపాధ్యాయుల పోస్టులు 30, ఎస్జీటీ పోస్టులు 1,965 ఉన్నాయి. ఇంతులో ఏ జిల్లాలోనైనా కొరత ఏర్పడితే కొత్తగా ఏర్పాటు చేసిన ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయ పోస్టులను అవసరమైన మేరకు వినియోగించుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
IND vs WI 1st T20I: భారత్ ముందు 172 పరుగుల ఛాలెంజ్
IND vs WI 1st T20I: భారత్ ముందు 172 పరుగుల ఛాలెంజ్
ఈఎంఐల్లో ఐఫోన్ కొంటున్నారా? ఒక్కసారి హీరో విజయ్ మాటలు వినండి
ఈఎంఐల్లో ఐఫోన్ కొంటున్నారా? ఒక్కసారి హీరో విజయ్ మాటలు వినండి
ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలో విషాదం.. గ్రెనేడ్ పేలి చేయి ఛిద్రం
ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలో విషాదం.. గ్రెనేడ్ పేలి చేయి ఛిద్రం
రాత్రి పడుకునే ముందు ఈ యోగాసాలు చేయండి.. క్షణాల్లో గాఢ నిద్రలోకి
రాత్రి పడుకునే ముందు ఈ యోగాసాలు చేయండి.. క్షణాల్లో గాఢ నిద్రలోకి
మెయిడీన్ ఓవర్లలో మొనగాళ్లు.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?
మెయిడీన్ ఓవర్లలో మొనగాళ్లు.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు