ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో భారీగా పోలీస్ కానిస్టేబుల్, ఎస్టై, హోం గార్డు పోస్టులకు ఏపీ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా విడుదల చేసినట్లు ఓ నోటిఫికేషన్ సోషల్ మీడియా మాద్యమాల్లో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతోంది. వీటిల్లో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు 6100, ఎస్సై పోస్టులు 411, హోంగార్డు పోస్టులు 100 వరకు ఉన్నట్లు పేర్కొంది. టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్ధులు slprb.ap.gov.in వెబ్‌సైట్ లింక్ ద్వారా అక్టోబర్ 25వ తేదీ నుంచి సరిగ్గా 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చని సదరు ప్రకటనలో వెల్లడించింది. వీటిల్లో హోంగార్డు పోస్టులకు నవంబర్ 7, 8, 9 తేదీల్లో ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉన్నట్లు తెల్పింది. ఐతే సదరు నోటిఫికేషన్‌పై తాజాగా ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న హోమ్ గార్డు పోస్టులకు సంబంధించిన షెడ్యూల్ నకిళీ అని స్పష్టం చేసింది. దీనిపై యువత అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటి ఫేక్ వార్తలను నమ్మొద్దని సూచించింది. సదరు ఫేక్ నోటిఫికేషన్‌పై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలుపుతూ ట్విటర్‌లో పోస్టు ద్వారా వివరణ ఇచ్చింది.
#FactCheck A fake schedule of Home Guard recruitment is being circulated on WhatsApp. Young aspirants please take note of this.@police_guntur is investigating the matter & legal action will be taken on the fake news peddlers.
@APPOLICE100 pic.twitter.com/3PCjgnv9Ba
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) October 28, 2022
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.