AP EAPCET 2024 Exam: ఏపీ ఈఏపీసెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

|

May 15, 2024 | 1:23 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (ఈఏపీసెట్‌) పరీక్షలు రేపట్నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి బుధవారం (మే 15) ఓ ప్రకటనలో తెలిపారు..

AP EAPCET 2024 Exam: ఏపీ ఈఏపీసెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
AP EAPCET 2024 Exam
Follow us on

అమరావతి, మే 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (ఈఏపీసెట్‌) పరీక్షలు రేపట్నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి బుధవారం (మే 15) ఓ ప్రకటనలో తెలిపారు. రేపు, ఎల్లుండు బైపీసీ గ్రూపుకి ఈఏపీసెట్ పరీక్షలు జరుగుతాయన్నారు. మే 18 వ తేదీ నుంచి 23 వరకు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలు జరుగుతాయన వెల్లడించారు. ఆయా తేదీల్లో రోజుకి రెండు సెషన్స్ లో పరీక్షలు జరుగుతాయని తెలిపానే. పరీక్షలు ఆన్‌లైన్ మోడ్ లో మాత్రమే నిర్వహిస్తున్నామన్నారు. మార్నింగ్ షిఫ్ట్‌ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మద్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండవ సెషన్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు.

ఈఏపీసెట్‌ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 140 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ లో రెండు సెంటర్లు ఏర్పాటు చేశామని హేమచంద్రారెడ్డి తెలిపారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,61,640 మంది పరీక్షలకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఇందులో అమ్మాయిలు 1,81,536 మంది ఉండగా.. అబ్బాయిలు 1,80,104 మంది వరకు ఉన్నట్లు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఎంపీసీ విభాగంలో 34,828 మంది అదనంగా దరఖాస్తు చేదుకున్నట్లు తెలిపారు. ఇక బైపీసీ విభాగంలో మాత్రం 13,138 మంది విద్యార్ధులు గత ఏడాదితో పోలిస్తే ఈసారి తక్కువగా దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. ఒక నిమిషం నిబందన పక్కాగా అమలు చేస్తామని, ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి తీసుకు రాకూడదని హెచ్చరించారు.

పరీక్షా కేంద్రంలోపలికి విద్యార్ధులని అరగంట ముందుగానే అనుమతి ఇస్తామని తెలిపారు. ఈఏపీసెట్‌ పరీక్షలు ముగిసే వరకు పరీక్షా కేంద్రాలకి బస్‌లు నడపాలని ఆర్టిసీకి ఈ సందర్భంగా విజ్ణప్తి చేశారు. పరీక్షా కేంద్రాలలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉంటుందని, ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా పరీక్షలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఈఏపీసెట్‌ ఛైర్మన్‌, కాకినాడ జేఎన్‌టీయే వీసీ ప్రొఫెసర్ ప్రసాదరాజు మాట్లాడుతూ..ఏపీ ఈఏపీసెట్‌ పరీక్షలకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఒక నిమిషం‌ నిబంధన పక్కాగా అమలు చేస్తాం. విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకి ముందుగానే చేరుకోవాలి. ఇప్పటికే విద్యార్ధులకి హాల్ టికెట్లను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచాం. విద్యార్దులెవరూ ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రానికి తీసుకురావద్దని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.