AP EAPCET 2022: రేపట్నుంచి ఏపీ ఈఏపీసెట్‌ 2022 పరీక్షలు.. ఈ నిబంధనలు తప్పనిసరి..

|

Jul 03, 2022 | 9:14 AM

ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌ అగ్రికల్చర్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (AP EAPCET 2022) రేపట్నుంచి (జూన్‌ 4) ప్రారంభంకానుంది. ఈ మేరకు పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇప్పటికే ఉన్నత విద్యామండలి (APSCHE) ప్రకటించింది. హాల్‌టికెట్లు..

AP EAPCET 2022: రేపట్నుంచి ఏపీ ఈఏపీసెట్‌ 2022 పరీక్షలు.. ఈ నిబంధనలు తప్పనిసరి..
Ap Eapcet 2022
Follow us on

AP EAPCET 2022 Exam Dates: ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌ అగ్రికల్చర్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (AP EAPCET 2022) రేపట్నుంచి (జూన్‌ 4) ప్రారంభంకానుంది. ఈ మేరకు పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇప్పటికే ఉన్నత విద్యామండలి (APSCHE) ప్రకటించింది. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోని విద్యార్ధులు చివరి నిముషం వరకు వేచి ఉండకుండా వెంటనే అధికారిక వెబ్‌సైట్‌ cets.apsche.ap.gov.in. నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యార్ధులకు సూచించింది. ఏపీ ఈఏపీసెట్‌ 2022 ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించిన పరీక్ష మొత్తం 5 రోజుల్లో.. జులై 4, 5, 6, 7, 8 తేదీల్లో జరగనుంది. ఆన్‌లైన్‌ విధానంలో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన పరీక్షలు జులై 11, 12 తేదీల్లో 4 సెషన్లలో జరగనున్నాయి. ఆయా పరీక్షల తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌ పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్ష జరుగుతుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు హాల్ టికెట్‌తోపాటు ఐడీ ప్రూఫ్‌ కూడా పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. పరీక్ష సమయానికి అరగంట ముందే ఎగ్జాం సెంటర్‌కు చేరుకోవల్సి ఉంటుంది. విద్యార్ధులు, సిబ్బంది కోవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.

కాగా ఏపీ ఈఏపీసెట్‌ 2022 క్వశ్యన్‌ పేపర్‌ ఇంగ్లిష్‌, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది. మొత్తం 160 ప్రశ్నలకు 180 నిముషాల పాటు పరీక్ష జరుగుతుంది. ఆగస్టు 15 తర్వాత ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎగ్జాం ప్యాట్రన్‌, ర్యాంకుల విధానంలో ఎటువంటి మార్పులులేవని, గత ఏడాది మాదిరిగానే ఉంటుందని, సెప్టెంబర్‌ రెండో వారంలోగా తరగతులు ప్రారంభించేందుకు అనుగుణంగా షెడ్యూల్‌ తయారు చేసినట్లు ఏపీ విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా బీఈ, బీటెక్‌, బీటెక్‌ (బయోటెక్‌), బీటెక్‌ (డైరీ టెక్నాలజీ), బీటెక్‌ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీఫార్మసీ, బీటెక్‌ (ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్, బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ, ఏహెచ్‌, బీఎఫ్‌ఎస్సీ, Pharm-D కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.