AP EAPCET 2022: జూన్‌ 27 ఏపీ ఈఏపీసెట్‌-2022 అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌.. పరీక్షల తేదీలివే..

|

Jun 22, 2022 | 1:42 PM

ఏపీ ఇంజినీరింగ్‌ అగ్రికల్చర్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (AP EAPCET 2022) ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించిన పరీక్ష జులై 4, 5, 6, 7, 8 తేదీల్లో మొత్తం 5 రోజుల్లో జరగనుంది..

AP EAPCET 2022: జూన్‌ 27 ఏపీ ఈఏపీసెట్‌-2022 అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌.. పరీక్షల తేదీలివే..
Ap Eapcet 2022
Follow us on

AP EAPCET 2022 exam date: ఏపీ ఇంజినీరింగ్‌ అగ్రికల్చర్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (AP EAPCET 2022) ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించిన పరీక్ష జులై 4, 5, 6, 7, 8 తేదీల్లో మొత్తం 5 రోజుల్లో జరగనుంది. ఆన్‌లైన్‌ విధానంలో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన పరీక్షలు జులై 11, 12 తేదీల్లో 4 సెషన్లలో జరగనున్నాయి. పరీక్షకు ఇంకా 13 రోజులే ఉన్నందున పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు సీరియస్‌గా ప్రిపేరవుతున్నారు. దీనికి సంబంధించిన అడ్మిట్‌ కార్డులను జూన్‌ 27 నుంచి అధికారిక వెబ్‌సైట్ https://sche.ap.gov.in/APSCHEHome.aspx నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

క్వశ్యన్‌ పేపర్‌ ఇంగ్లిష్‌, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది. మొత్తం 160 ప్రశ్నలకు 180 నిముషాల పాటు పరీక్ష జరుగుతుంది. ఆగస్టు 15 తర్వాత ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎగ్జాం ప్యాట్రన్‌, ర్యాంకుల విధానంలో ఎటువంటి మార్పులులేవని, గత ఏడాది మాదిరిగానే ఉంటుందని, సెప్టెంబర్‌ రెండో వారంలోగా తరగతులు ప్రారంభించేందుకు అనుగుణంగా షెడ్యూల్‌ తయారు చేసినట్లు ఏపీ విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా బీఈ, బీటెక్‌, బీటెక్‌ (బయోటెక్‌), బీటెక్‌ (డైరీ టెక్నాలజీ), బీటెక్‌ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీఫార్మసీ, బీటెక్‌ (ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్, బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ, ఏహెచ్‌, బీఎఫ్‌ఎస్సీ, Pharm-D కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.