ఈ విద్యా సంవత్సరం నుంచే 8వ తరగతిలో ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభం: సీఏం జగన్‌

2022-23 విద్యాసంవత్సరంలో 8వ తరగతిలో ఇంగ్లీష్‌ మీడియం (English Medium) ప్రారంభించాలని సీఏం జగన్‌ నేడు (ఏప్రిల్‌ 13) క్యాంప్‌ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో తెలిపారు..

ఈ విద్యా సంవత్సరం నుంచే 8వ తరగతిలో ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభం: సీఏం జగన్‌
Cm Ys Jagan
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 13, 2022 | 3:49 PM

AP govt to introduce English Medium for 8th class students: 2022-23 విద్యాసంవత్సరంలో 8వ తరగతిలో ఇంగ్లీష్‌ మీడియం (English Medium) ప్రారంభించాలని సీఏం జగన్‌ నేడు (ఏప్రిల్‌ 13) క్యాంప్‌ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో తెలిపారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రతి మండలానికీ 2 జూనియర్‌ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, వాటిల్లో అమ్మాయిలకు ప్రత్యేకించి ఒక కాలేజీ ఏర్పాటు చేయాలన్నారు. ఇక ఈ ఏడాది జగనన్న విద్యాకానుకకు (Jagananna Vidya Kanuka) అంతా సిద్ధం చేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. స్కూళ్లు తెరిచే నాటికి విద్యార్ధులకు విద్యాకానుక అందించేలా చర్యలు తీసుకోవాలని సీఏం ఆదేశించారు. ఇక ఈ ఏడాది విద్యాకానుకకు దాదాపుగా రూ.960 కోట్లు ఖర్చు అవ్వనుందని, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. పాఠశాలల్లో చదువుతున్న పిల్లలందరూ మన పిల్లలే, వారిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

నాడు – నేడు రెండో దశ పనులపై ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ.. రెండో దశ పనుల వేగం పెంచాలన్నారు. రెండోదశ కింద దాదాపు 25 వేల స్కూళ్లలో పనులు ప్రారంభించాలని, ఈ పనుల ద్వారా ఈ ఏడాది స్కూళ్లలో గణనీయమైన మార్పులు కనిపించాలని అధికారులను ఆదేశించారు. దీంతో చరిత్రలో మన ప్రభుత్వం పేరు, భాగస్వాములైన అధికారుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. నాడు-నేడు రెండోదశ ఖర్చు రూ. 11,267 కోట్లుగా అంచనా వేశారు. విద్యావ్యవస్థలో మహిళా పోలీసులు నిర్వర్తించాల్సిన విధులపై సీఎం ఆదేశాలమేరకు అధికారులు ఎస్‌ఓపీని రూపొందించినట్లు తెలిపారు. స్కూళ్లు, కాలేజీల్లో భద్రతపై మహిళా పోలీసులు విద్యార్ధులకు అవగాహన కల్పించనున్నారు.

Also Read:

TSPSC 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ఇకపై టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 పోస్టులకు ఇంటర్వ్యూలు లేవోచ్‌..