AP CETs 2025 Exam Schedule: ఏపీ సెట్స్‌ 2025 పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈసెట్‌, ఐసెట్‌, ఈఏపీసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌, పీజీసెట్‌ వంటి పలు ప్రవేశ పరీక్షలు మే, జూన్ నెలల్లో జరగనున్నాయి. వీటికి సంబంధించిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ఇప్పటికే పూర్తి కాగా.. త్వరలోనే అడ్మిట్ కార్డులను ఉన్నత విద్యామండలి విడుదల చేయనుంది..

AP CETs 2025 Exam Schedule: ఏపీ సెట్స్‌ 2025 పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?
AP CETs 2025 Schedule

Updated on: May 04, 2025 | 7:52 PM

అమరావతి, మే 4: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (APSCHE) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం..

ఏపీ సెట్స్‌-2025 పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

  • మే 6న ఈసెట్‌ 2025 ప్రవేశ పరీక్ష
  • మే 7న ఐసెట్‌ 2025 ప్రవేశ పరీక్ష
  • మే 19 నుంచి 27 వరకు ఈఏపీసెట్‌ 2025 ప్రవేశ పరీక్ష
  • జూన్‌ 5 లాసెట్‌, ఎడ్‌సెట్‌ 2025 ప్రవేశ పరీక్ష
  • జూన్‌ 6 నుంచి 8వ తేదీ వరకు పీజీఈసెట్‌ 2025 ప్రవేశ పరీక్ష
  • జూన్‌ 9 నుంచి 13 వరకు పీజీసెట్‌ పరీక్ష

ఈ పరీక్షలన్నీ ఆయా తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో షిఫ్టుల వారిగా ఏపీ ఉన్నత విద్యామండలి నిర్వహించనుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు హాల్‌ టికెట్‌, ఏదైనా ఒక ఒరిజినల్‌ ఐడీ ప్రూఫ్‌ అంటే ఆధార్, పాప్‌పోర్ట్, ఓటర్‌..వంటివి తీసుకెళ్లాలి. అలాగే ఒక బ్లాక్‌ లేదా బ్లూ కలర్‌ పెన్‌ తమతోపాటు పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లవచ్చు. ఈ మేరకు సూచనలు మార్గదర్శకాలను ఉన్నత విద్యామండలి జారీ చేసింది. పూర్తి వివరాలు ఈ కింది అధికారిక ప్రకటన ద్వారా తెలుసుకోవచ్చు.

టెన్త్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు షురూ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఫెయిలైన విద్యార్ధులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తుంది. ఈ మేకు విద్యాశాఖ ప్రణాళిక విడుదల చేసింది. పదిలో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు మే 19 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మే 18 వరకు విద్యార్ధులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ సూచించింది. మండల కేంద్రాల్లో కోచింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, సాధ్యం కానప్పుడు ఏ పాఠశాలకు ఆ పాఠశాలలో కోచింగ్‌ నిర్వహించాలని అధికారులను తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.