AP Animal Husbandry Hall Tickets: పశుసంవర్ధక సహాయకుల పోస్టులకు డిసెంబర్ 31న రాత పరీక్ష.. వెబ్‌సైట్లో హాల్‌ టికెట్లు

ఆంధ్రప్రదేశ్‌లో పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీకి బుధవారం (డిసెంబర్‌ 27వ తేదీన) హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు డిసెంబర్‌ 31న రాష్ట్ర వ్యాప్తంగా రాత పరీక్ష జరుగనుంది. పశుసంవర్ధక సబార్డినేట్ సర్వీసులో రెగ్యులర్ ప్రాతిపదికన మొత్తం 1,896 పశుసంవర్ధక సహాయక (ఏహెచ్‌ఏ) ఖాళీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌..

AP Animal Husbandry Hall Tickets: పశుసంవర్ధక సహాయకుల పోస్టులకు డిసెంబర్ 31న రాత పరీక్ష.. వెబ్‌సైట్లో హాల్‌ టికెట్లు
AP Animal Husbandry Hall Tickets

Updated on: Dec 27, 2023 | 1:56 PM

అమరావతి, డిసెంబర్ 27: ఆంధ్రప్రదేశ్‌లో పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీకి బుధవారం (డిసెంబర్‌ 27వ తేదీన) హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు డిసెంబర్‌ 31న రాష్ట్ర వ్యాప్తంగా రాత పరీక్ష జరుగనుంది. పశుసంవర్ధక సబార్డినేట్ సర్వీసులో రెగ్యులర్ ప్రాతిపదికన మొత్తం 1,896 పశుసంవర్ధక సహాయక (ఏహెచ్‌ఏ) ఖాళీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. గోపాలమిత్ర సూపర్‌వైజర్‌గా పనిచేసిన అభ్యర్థులు వెయిటేజీ ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.22,460 నుంచి రూ.72,810 వరకు జీతంగా చెల్లిస్తారు. హాల్ టికెట్ల కోసం క్లిక్ చేయండి.

డిసెంబర్‌ 27 నుంచి అంబేడ్కర్‌ దూరవిద్య డిగ్రీ పరీక్షలు

అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్‌ పరీక్షలు డిసెంబరు 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ సమన్వయ కేంద్రం అధికారి డాక్టర్‌ ఆడెపు శ్రీనివాస్‌ డిసెంబరు 26 (మంగళవారం) ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబర్‌ 27వ తేదీ నుంచి బీఎస్సీ సైన్స్‌ ప్రయోగ తరగతులు కూడా ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.

నర్సరీలో ప్రవేశాలకు స్క్రీనింగ్‌ వద్దు

నర్సరీలో ప్రవేశాలు కల్పించడానికి చిన్నారులకు విద్యాసంస్థలు స్క్రీనింగ్‌ నిర్వహించడంపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్‌ దాఖలైంది. నర్సరీ విద్యార్ధులకు స్క్రీనింగ్‌ నిర్వహణను నిషేధించడమే లక్ష్యంగా ఢిల్లీ అసెంబ్లీ 2015లో ఓ బిల్లును ఆమోదించింది కూడా. అయితే దాన్ని ఆమోదించకుండా, వెనక్కి పంపకుండా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తన వద్దే ఉంచుకోవడంపై ‘సోషల్‌ జూరిస్ట్‌’ అనే స్వచ్ఛంద సంస్థ గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కానీ ఆ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని అదే ఏడాది అక్టోబరు 13వ తేదీన కోర్టు స్పష్టం చేసింది. చట్టాన్ని రూపొందించడానికి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. ఈ మేరకు ఎన్జీవో వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై సంతకం చేయకుండా పంజాబ్, తమిళనాడు గవర్నర్లు తీవ్ర జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు ఇటీవల పలు సందర్భాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అక్టోబరు 13 నాటి తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ సోషల్‌ జూరిస్ట్‌ సమీక్షా పిటిషన్‌ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200లోని నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర గవర్నర్లు వ్యవహరించాలన్న సుప్రీం కోర్టు పరిశీలనను పిటిషన్ ప్రస్తావించింది. ఆర్టికల్ 200 ఒక రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును ఆమోదం కోసం గవర్నర్‌కు సమర్పించే ప్రక్రియను వివరిస్తుంది. ఈ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ బిల్లుకు సమ్మతిని ఇవ్వవచ్చు లేదా ఆమోదాన్ని నిలిపివేయవచ్చు లేదా భారత రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును రిజర్వ్ చేయవచ్చు. శాసనసభ పునఃపరిశీలన కోసం కూడా గవర్నర్ బిల్లును తిరిగి పంపవచ్చు. నర్సరీ అడ్మిషన్ కోసం స్క్రీనింగ్ విధానాన్ని నిషేధించే చైల్డ్-ఫ్రెండ్లీ బిల్లు గత ఏడేళ్లుగా ఎటువంటి ప్రొగ్రెస్‌ లేకుండా కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య ఊగిసలాడుతుందని న్యాయవాది అశోక్ అగర్వాల్ పేర్కొంటూ సమీక్షా పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది ప్రజా ప్రయోజనాలకు, ప్రజా విధానానికి విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.