AOC Secunderabad Jobs 2022: మరో అవకాశం! సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్.. 419 మెటీరియల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో విడుదల చేసిన..

AOC Secunderabad Jobs 2022: మరో అవకాశం! సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు..
AOC Secunderabad Recruitment 2022

Updated on: Nov 13, 2022 | 7:11 AM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్.. 419 మెటీరియల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్‌ ప్రకారం ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 12వ తేదీతో ముగియగా.. తాజాగా ఆ తేదీని పెంపొందించింది. దీంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులకు మరో అవకాశం ఇచ్చినట్లైంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌/డిప్లొమా, ఇంజనీరింగ్‌/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 15వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా18 నుంచి 27 యేళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్, ఫిజికల్ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.29,200ల నుంచి రూ.92,300ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

రాత పరీక్ష విధానం..

రాత పరీక్ష మొత్తం 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు, 150 మార్కులకు గానూ రెండు గంటల సమయంలో జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులు, న్యూమరిక్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలో 25 ప్రశ్నలకు 25 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ విభాగంలో 25 ప్రశ్నలకు 25 మార్కులు, ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.