AP TET 2025 Hall Tickets: మరికాసేపట్లో టెట్‌ అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2025 రాత పరీక్షలు మరో వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు బుధవారం (డిసెంబర్‌ 3) విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి..

AP TET 2025 Hall Tickets: మరికాసేపట్లో టెట్‌ అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
Andhra Pradesh TET Admit Cards

Updated on: Dec 03, 2025 | 7:27 AM

అమరావతి, డిసెంబర్‌ 3: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2025 రాత పరీక్షలు మరో వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు బుధవారం (డిసెంబర్‌ 3) విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక టెట్‌ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు డిసెంబర్ 10 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,58,638 మంది టెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే మాక్‌ టెస్టులను కూడా పాఠశాల విద్యా శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏపీ టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్‌లో మాక్‌ పరీక్షలు రాయడానికి అవకాశాన్ని కల్పించింది. అభ్యర్థులు ఎలాంటి పాస్‌వర్డ్‌ లేకుండా సైన్‌-ఇన్‌ అవడం ద్వారా ఉచితంగానే మాక్‌ టెస్టులను ఉపయోగించుకోవచ్చు. డిసెంబర్‌ 10 నుంచి టెట్ పరీక్షలు రోజుకు రెండు సెషన్‌లలో జరగనున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం ప్రాథమిక కీ 2026 జనవరి 2న విడుదల చేస్తారు. ఇక ఫైనల్‌ కీ జనవరి 13న వెల్లడించి, తుది ఫలితాలు జనవరి 19న విడుదల చేయనున్నారు.

మరోవైపు వచ్చే ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీచేస్తామని ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది 16వేలకు పైగా పోస్టులు భర్తీచేసింది. అయితే ఇందులో మిగిలిన పోస్టులతోపాటు కొత్తగా ఏర్పడే ఖాళీలతో 2 వేల పోస్టులతో కొత్త డీఎస్సీ ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో టెట్‌కు మరోమారు నిరుద్యోగులు తమ వెయిటేజీ మార్కులు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us