AP SSC Results 2022: ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..

| Edited By: Anil kumar poka

Jun 07, 2022 | 3:44 PM

AP 10th Class Results 2022 : విద్యార్థులు, తల్లిదండ్రుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.. ఈసారి ఎంత మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారంటే..

AP SSC Results 2022: ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..
AP EAPCET 2022 Key

AP 10th Class Result 2022 : విద్యార్థులు, తల్లిదండ్రుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ ఫలితాలను సోమవారం విడుదల చేశారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. రెండేళ్ల తర్వాత జరిగిన పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇదిలా ఉంటే ప్రతీసారి విద్యార్థుల ఫలితాలను గ్రేడ్‌ల రూపంలో అందించేవారు. కానీ ఈసారి మాత్రం గ్రేడ్‌లకు బదులు మార్కులను ప్రకటించారు.

పరీక్షలకు మొత్తం 6,21,799 మంది హాజరుకాగా 414281 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసారి 67.72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. వీరిలో బాలురు 64.02 శాతం, బాలికలు 70.70 శాతం పాస్‌ అయ్యారు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 78.30 శాతం మంది, అత్యల్పంగా అనంతపురంలో 49.70 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు మొత్తం 11751 స్కూళ్లకు చెందిన విద్యార్థులు హాజరుకాగా వీటిలో 797 పాఠశాలల్లో నూటికి నూరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, 71 స్కూళ్లలో 0 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులకు జూలై 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. విద్యార్థులు రేపటి (మంగళవారం) నుంచి సప్లిమెంటరీ ఫీజు కట్టుకునే అవకాశం కల్పించారు. నెల రోజుల్లోపే సప్లిమెంటరీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు.

విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు, ర్యాంకుల ప్రకటనలకు అడ్డుకట్ట వేసేందుకు గతంలో గ్రేడ్ల విధానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి బదులు మార్కులను ప్రకటించనున్నారు. ఆర్మీ, ఇతరత్రా ఉద్యోగాలు, పై చదువుల ప్రవేశాలకు మార్కులు అవసరమవుతున్నాయని గ్రేడ్ల విధానాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 27 నుంచి మే 9 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు మొత్తం 6,21,799 విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,776 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇక జూలై మొదటి లేదా రెండో వారంలో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Jun 2022 12:35 PM (IST)

    నేరుగా ఫలితాలు ఇలా పొందండి..

    పదోతరగతి పరీక్షా ఫలితాలను పొందడానికి కింది బాక్స్ లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి పొందవచ్చు..

  • 06 Jun 2022 12:18 PM (IST)

    సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుంచంటే..

    పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులకు జూలై 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. విద్యార్థులు రేపటి నుంచి సప్లిమెంటరీ ఫీజు కట్టుకునే అవకాశం కల్పించారు. నెల రోజుల్లోపే సప్లిమెంటరీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు.


  • 06 Jun 2022 12:11 PM (IST)

    స్కూళ్ల విషయానికొస్తే..

    ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు మొత్తం 11751 స్కూళ్లకు చెందిన విద్యార్థులు హాజరుకాగా వీటిలో 797 పాఠశాలల్లో నూటికి నూరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, 71 స్కూళ్లలో 0 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

  • 06 Jun 2022 12:07 PM (IST)

    ఎంత మంది పాస్ అయ్యారంటే..

    ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు మొత్తం 6,21,799 మంది హాజరుకాగా 414281 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసారి 67.72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. వీరిలో బాలురు 64.02 శాతం, బాలికలు 70.70 శాతం పాస్‌ అయ్యారు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 78.30 శాతం మంది, అత్యల్పంగా అనంతపురంలో 49.70 శాతం ఉత్తీర్ణత సాధించారు.

  • 06 Jun 2022 11:38 AM (IST)

    ఏపీ టెన్త్‌ రిజల్ట్స్‌ హిందీ, ఇంగ్లిష్‌లో అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

    ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు ఇంగ్లిష్‌ లైవ్‌ బ్లాగ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

    ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు హిందీ లైవ్‌ బ్లాగ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

     

     

  • 06 Jun 2022 11:21 AM (IST)

    రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..

    •  ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ bse.ap.gov.inలోకి వెళ్లాలి.
    • అనంతరం AP SSC result 2022 లింక్‌పై క్లిక్‌ చేయండి.
    • తర్వాత పుట్టిన తేదీ, రోల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయాలి
    • వెంటనే స్క్రీన్‌పై ఫలితాలు వచ్చేస్తాయి.
  • 06 Jun 2022 11:15 AM (IST)

    అలా చేస్తే చర్యలు తప్పవు..

    ఈసారి పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులకు వచ్చిన మార్కులను మాత్రమే ప్రకటించనున్న నేపథ్యంలో ఏ విద్యాసంస్థ అయినా తమ విద్యార్థికి ఫలానా ర్యాంకు వచ్చిందని ప్రకటనలు ఇస్తే మూడేళ్ల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని విద్యాశాఖ హెచ్చరించింది.

Follow us on