AP SSC 2024 Results: ‘పది’ ఫలితాల్లో అమ్మాయిలదే పై చేయి.. మొత్తం ఎంత మంది పాస్‌ అయ్యారంటే

రాష్ట్ర ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ దేవానంద రెడ్డి ఈ రోజు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి చివరి పని దినానికి ముందుగానే పదో తరగతి ఫలితాలు విడుదల చేసినట్లు ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ ఏడాది పాఠశాలలకు లాస్ట్ వర్కింగ్‌ డే ఏప్రిల్ 23వ తేదీ. ఇక ఈ సారి 6.16 వేల రెగ్యులర్‌ విద్యార్ధులు పరీక్షలకు హాజరవగా.. ఒక్క విద్యార్ధి కూడా మాల్‌ ప్రాక్టీస్‌కు..

AP SSC 2024 Results: పది ఫలితాల్లో అమ్మాయిలదే పై చేయి.. మొత్తం ఎంత మంది పాస్‌ అయ్యారంటే
AP SSC Result

Updated on: Apr 22, 2024 | 12:16 PM

అమరావతి, ఏప్రిల్ 22: రాష్ట్ర ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ దేవానంద రెడ్డి ఈ రోజు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి చివరి పని దినానికి ముందుగానే పదో తరగతి ఫలితాలు విడుదల చేసినట్లు ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ ఏడాది పాఠశాలలకు లాస్ట్ వర్కింగ్‌ డే ఏప్రిల్ 23వ తేదీ. ఇక ఈ సారి 6.16 వేల రెగ్యులర్‌ విద్యార్ధులు పరీక్షలకు హాజరవగా.. ఒక్క విద్యార్ధి కూడా మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడలేదు. 8 రోజుల్లో వాల్యుయేషన్‌ కంప్లీట్ చేసి, 22 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించారు. మొత్తం 6,16,615 మంది పరీక్షలకు హాజరవగా వీరిలో 5,34,574 మంది ఉత్తీర్ణత (86.69 శాతం) ఉత్తీర్ణత పొందారు. బాలురు 84.02 శాతం, బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణత పొందారు.

ఏపీ పదో తరగతి 2024 ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి.

సబ్జెక్ట్‌ వైజ్‌ ఉత్తీర్ణత శాతం ఇలా..

ఈ రోజు విడుదలైన టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల్లో సబ్జెక్ట్‌ వారీగా ఉత్తీర్ణత శాతం చూస్తే..

  • ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌లో 96.47 శాతం (తెలుగు)
  • సెకండ్ ల్యాంగ్వేజ్‌లో 99.24 శాతం (హిందీ)
  • థార్డ్‌ ల్యాంగ్వేజ్‌లో 98.52 శాతం (ఇంగ్లిష్‌)
  • మ్యాథమెటిక్స్‌లో ఉత్తీర్ణత: 93.33 శాతం
  • జనరల్ సైన్స్‌లో 91.29 శాతం
  • సోషల్ స్టడీస్‌లో 95.34 శాతం

పదో తరగతి ఫలితాల్లో మీడియం వైజ్‌ ఫలితాల శాతం ఇలా..

  • తెలుగు మీడియంలో 71.08 శాతం
  • ఇంగ్లిష్‌ మీడియంలో 92.32 శాతం
  • హిందీ మీడియంలో 100 శాతం (12 మంది రాశారు)
  • ఉర్దూ మీడియంలో 87.92 శాతం
  • కన్నడ మీడియంలో 56.84 శాతం
  • తమిళ మీడియంలో 94.62 శాతం
  • ఒడియా మీడియంలో 94.91 శాతం

మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.