
ఆంధ్రప్రదేశ్‌లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిసన్స్ అండ్ కరెక్షనల్ సర్వీస్.. మంగళగిరి, కడప, నెల్లూరు జిల్లాల్లోని జైళ్లలో తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన కింద మొత్తం 14 పోస్టులను వివిధ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ డిగ్రీ, జీఎన్‌ఎంలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి తప్పపనిసరిగా 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 09, 2025వ తేదీలోపు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే నింపిన దరఖాస్తులను కింది సంబంధిత అడ్రస్‌లో పోస్టు ద్వారా లేదా లేదంటే స్వయంగా వెళ్లి అందించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో దరఖాస్తు ఫీజు కింద ఓసీ అభ్యర్థులు రూ.400, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫ్రిజన్స్,
గుంటూరు రాగ్నే, కొల్లిస్ రెసిడెన్సీ,
7వ లైన్, రాజ రాజేశ్వరి నగర్,
ఆశ్రమ రోడ్, తాడేపల్లి, గుంటూరు జిల్లా 522501.
లేదంటే ఈ మెయిన్‌కు digprisonsgnt@gmail.com కూడా పంపించవచ్చు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.