Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Mega DSC 2025 Answer Key: మెగా డీఎస్సీ ఆన్సర్ ‘కీ’, రెస్పాన్స్‌షీట్లు వచ్చేశాయ్‌.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే!

రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 6వ తేదీ నుంచి జులై 2వ తేదీ వరకు దాదాపు 3,36,307 మంది అభ్యర్ధులకు మొత్తం 23 రోజుల పాటు ఆన్ లైన్ రాత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీలతోపాటు, రెస్పాన్స్ షీట్లను విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి..

AP Mega DSC 2025 Answer Key: మెగా డీఎస్సీ ఆన్సర్ ‘కీ’, రెస్పాన్స్‌షీట్లు వచ్చేశాయ్‌.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే!
Mega Dsc Answer Key
Srilakshmi C
|

Updated on: Jul 04, 2025 | 5:17 PM

Share

అమరావతి, జులై 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ పరీక్షలు జులై 2వ తేదీలో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ ‘కీ’, రెస్పాన్స్‌ షీట్లను ఒక్కొక్కటిగా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతూ వస్తుంది. మిగిలిన అన్ని సబ్జెక్టుల అన్ని పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీలను, రెస్పాన్స్‌ షీట్లను జులై 3 నుంచి వెబ్‌సైట్‌లోకి అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్‌ వెంకట కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలు రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలతో లాగిన్‌ అయ్యి ఆన్సర్ కీ, రెస్సాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

జూన్‌ 6 నుంచి జూన్‌ 28 వరకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ‘కీ’ని విడుదల చేశామన్నారు. ఇందులో పీజీటీ కామర్స్, ఇంగ్లిష్, హిందీ, భౌతికశాస్త్రం, సంస్కృతం, సాంఘిక శాస్త్రం, తెలుగు, స్కూల్‌ అసిస్టెంట్‌ విభాగంలో ఆంగ్లం, భౌతికశాస్త్రం పరీక్షల ‘కీ’లు ఉన్నాయని వెల్లడించారు. అలాగే ఎస్జీటీ జనరల్, స్పెషల్‌ పోస్టులు, టీజీటీలో ఇంగ్లిస్, హిందీ, భౌతికశాస్త్రం, తెలుగు, ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష, స్పెషల్‌ పీఈటీ, జనరల్‌ పీఈటీకి సంబంధించిన అన్ని మాధ్యమాల ప్రాథమిక ఆన్సర్ ‘కీ’, రెస్పాన్స్‌ షీట్లూ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. వీటిపై అభ్యంతరాలను తెలిపేందుకు జులై 11వ తేదీ వరకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆన్సర్‌ కీపై అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో పంపించాలని సూచించారు. అయితే జూన్‌ 29 నుంచి జులై 2 వరకు జరిగిన పరీక్షల ప్రాథమిక ఆన్సర్ ‘కీ’లను కూడా త్వరలో విడుదల చేస్తామని కన్వీనర్‌ వెంకట కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

మరోవైపు మెగా డీఎస్సీ విజయవంతంగా నిర్వహించినందుకు అన్ని జిల్లాలు, రాష్ట్ర అధికారులకు విద్య శాఖ మంత్రి నారా లోకేశ్​ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. 31 కోర్టు కేసులు దాటుకుని పరీక్షలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు. ఎస్సీ ఉప-వర్గీకరణ, స్పోర్ట్స్ కోటా నిబంధనల మేరకు నియామకాలు చేపట్టామని అన్నారు. ప్రాథమిక ఆన్సర్‌ కీపై అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత తుది ‘కీ’ విడుదల చేస్తామన్నారు. తుది వచ్చిన వారం రోజుల్లోనే ఫలితాలు కూడా వెల్లడిస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో