AP Inter Results 2023: ఏపీ ఇంటర్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. ఇలా సింపుల్‌గా చెక్‌ చేసుకోండి.

|

Apr 26, 2023 | 7:05 PM

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ విద్యార్థులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. ఏపీలో ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌తో పాటు సెకండ్‌ ఇయర్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో సాయంత్రం 5 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఫస్ట్‌ ఇయర్‌...

AP Inter Results 2023: ఏపీ ఇంటర్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. ఇలా సింపుల్‌గా చెక్‌ చేసుకోండి.
TS Inter Results
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ విద్యార్థులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. ఏపీలో ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌తో పాటు సెకండ్‌ ఇయర్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో సాయంత్రం 6 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ కలిపి 9,20,552 మంది, వృత్తి విద్య కోర్సు పరీక్షలకు 83,749 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,489 కేంద్రాల్లో మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4వరకు విద్యార్థులు పరీక్షలు రాసిన విషయం తెలిసిందే.

ఫలితాలు ఇక్కడ చూసుకోండి..

4 లక్షల 84వేల మంది విద్యార్థులు ఇంటర్‌ ఫస్టియర్‌ ఎగ్జామ్స్‌, 5లక్షల 19వేల మంది విద్యార్థులు ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఎగ్జామ్స్‌ హాజరయ్యారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 61 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 2,66,322 మంది పాస్‌ అయ్యారు. సెకండ్‌ ఇయర్‌ విషయానికొస్తే మొత్తం 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో బాలికలు 65 శాతం, 58 బాలురు పాస్‌ అయ్యారు. సెకండ్‌ ఇయర్‌లో బాలికలు 75 శాతం మంది బాలికలు, 68 శాతం మంది బాలురు పాస్‌ అయ్యారు. మొత్తం మీద ఇంటర్‌ రిజల్ట్స్‌లో బాలికలదే పైచేయి.

ఇవి కూడా చదవండి

జిల్లాల వారీగా ఫలితాలు..

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 75 శాతంతో కృష్ణజిల్లా మొదటి స్థానంలో నిలవగా వెస్ట్‌ గోదావరి (70 శాతం), గుంటూరు (68 శాతం)తో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక సెకండ్‌ ఇయర్‌ విషయానికొస్తే 83 శాతంతో కృష్ణ జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. గుంటూరు (78 శాతం), వెస్ట్‌ గోదావరి (77 శాతం) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో 46 శాతంతో కడప చివరి స్థానంలో నిలవగా, సెకండ్‌ ఇయర్‌లో 57 శాతంతో విజయనగరం చివరి స్థానంలో నిలిచింది.