
AP Inter Public Exams fee last date
అమరావతి, అక్టోబర్ 28: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు 2026 వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే పూర్తి టైం టేబుల్ కూడా విడుదల చేసింది. ఇక పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ కూడా మొదలైంది. ఈ క్రమంలో ఇప్పటికే ఒకసారి ఫీజు చెల్లింపుల గడువును పొడిగించిన ఇంటర్ బోర్డు తాజాగా మరోమారు తుది గడువును పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. తాజా ప్రకటన మేరకు అక్టోబర్ 31వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని ఏపీ ఇంటర్ బోర్డ్ తెలిపింది. దీంతో మరో 4 రోజులు పొడిగించినట్లు ఏపీ ఇంటర్ బోర్డ్ కార్యదర్శి వెల్లడించారు. రూ.1000 ఆలస్య రుసుంతో నవంబర్ 6వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. థియరీ పేపర్లకు రూ.600, ప్రాక్టికల్స్‌కు రూ.275, బ్రిడ్జికోర్సు సబ్జెక్టుకు రూ.165 చొప్పున చెల్లించాలని బోర్డు సూచించింది. కాగా ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 23, 2025వ నుంచి మార్చి 23 వరకు జరగనున్నాయి.
ఏపీ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీ ఇంటర్ 1st ఇయర్ పరీక్షల పూర్తి షెడ్యూల్ 2026 ఇదే..
- ఫిబ్రవరి 23న లాంగ్వేజ్ పేపర్ 1 పరీక్ష
- ఫిబ్రవరి 25న ఇంగ్లీష్ పేపర్ 1 పరీక్ష
- ఫిబ్రవరి 27న హిస్టరీ పేపర్ 1 పరీక్ష
- మార్చి 2న మ్యాథ్స్ పేపర్ 1 పరీక్ష
- మార్చి 5న జూలాజీ / మ్యాథ్స్ 1బి పరీక్ష
- మార్చి 7న ఎకనామిక్స్ 1 పరీక్ష
- మార్చి 10న ఫిజిక్స్ 1 పరీక్ష
- మార్చి 12న కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 1 పరీక్ష
- మార్చి 14న సివిక్స్ 1 పరీక్ష
- మార్చి 17న కెమిస్ట్రీ 1 పరీక్ష
- మార్చి 20న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 1 పరీక్ష
- మార్చి 24న మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ 1 పరీక్ష
ఏపీ ఇంటర్ 2nd ఇయర్ పరీక్షల పూర్తి షెడ్యూల్ 2026 ఇదే..
- ఫిబ్రవరి 24న లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష
- ఫిబ్రవరి 26న ఇంగ్లీష్ పేపర్ 2 పరీక్ష
- ఫిబ్రవరి 28న హిస్టరీ / బోటనీ పేపర్ 2 పరీక్ష
- మార్చి 3న మ్యాథ్స్ పేపర్ 2 ఎ / సివిక్స్ 2 పరీక్ష
- మార్చి 6న జూలాజీ 2 / ఎకనామిక్స్ 2 పరీక్ష
- మార్చి 9న మ్యాథ్స్ పేపర్ 2 బి పరీక్ష
- మార్చి 11న ఫిజిక్స్ / కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 2 పరీక్ష
- మార్చి 13న ఫిజిక్స్ 2 పరీక్ష
- మార్చి 16న మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ 2 పరీక్ష
- మార్చి 18న కెమిస్ట్రీ 2 పరీక్ష
- మార్చి 23న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 2 పరీక్ష
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.