ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖలో.. ఒప్పంద ప్రాతిపదికన 461 స్టాఫ్‌నర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ/బీఎస్సీ నర్సింగ్ లేదా సంబంధిత స్పెషలైజేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు 52 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది.
ఈ అర్హతలున్న వారు ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబర్ 6, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌లో దరఖాస్తులు సమర్పించవల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.500లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/వికలాంగ అభ్యర్ధులు రూ.300లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, రాత పరీక్ష, అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
మొత్తం 100 మార్కులకు సెలక్షన్ ప్రక్రియ ఉంటుంది. వీటిల్లో 75 శాతం మార్కులకు రాత పరీక్ష, 10 శాతం మార్కులు అకడమిక్ మార్కులు, మిగతా 15 శాతం మార్కలు పని అనుభవానికి కేటాయిస్తారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.