AP Mega DSC 2024: జులై 1న మెగా డీఎస్సీతోపాటు టెట్‌ నోటిఫికేషన్ కూడా.. సర్కార్ కీలక నిర్ణయం

|

Jun 25, 2024 | 3:51 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన సోమవారం (జూన్‌ 24) కొలువైన మంత్రిమండలి మెగా డీఎస్సీ పాటు టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) కూడా నిర్వహించేందుకు అమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించని వారితో పాటు, ఈ ఏడాది కొత్తగా బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి..

AP Mega DSC 2024: జులై 1న మెగా డీఎస్సీతోపాటు టెట్‌ నోటిఫికేషన్ కూడా.. సర్కార్ కీలక నిర్ణయం
AP Mega DSC 2024
Follow us on

అమరావతి, జూన్‌ 25: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన సోమవారం (జూన్‌ 24) కొలువైన మంత్రిమండలి మెగా డీఎస్సీ పాటు టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) కూడా నిర్వహించేందుకు అమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించని వారితో పాటు, ఈ ఏడాది కొత్తగా బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు కూడా మెగా డీఎస్సీ రాసేంందుకు అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో మరోమారు టెట్‌ పరీక్ష నిర్వహించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ జులై 1వ తేదీన విడుదలకానుంది. కొంచెం అటుఇటుగా టెట్ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయనున్నారు. కొంచెం తేదీల మార్పుతో ఒకేసారి దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డీఎస్సీ కంటే ముందే మొదట టెట్‌ పరీక్ష నిర్వహించి.. ఆ తర్వాత డీఎస్సీకి సన్నద్ధమయ్యేందుకు 30 రోజులు సమయం ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. టెట్‌ ఫలితాలు వెలువడిన తర్వాత డీఎస్సీ పరీక్ష ఉంటుంది.

అన్నీ అనుకున్నట్లు కుదిరితే జులై 1వ తేదీనే మెగా డీఎస్సీతోపాటు టెట్‌కు కూడా ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటనను రద్దు చేసి, కొత్తగా 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ ప్రకటన ఇస్తారు. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడగా.. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,72,487 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఎన్నికల కోడ్‌ కారణంగా పరీక్ష నిర్వహించకుండానే వాయిదా పడింది. ఆ తర్వాత అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేసి పోస్టుల సంఖ్య పెంచి.. మెగా డీఎస్సీకి నోటిఫికేసన్‌ వెలువరించనున్నట్లు ప్రకటించింది.

సోమవారం మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి ఏడాదీ డీఎస్సీ నిర్వహించే అంశంపై కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఏ విద్యా సంవత్సరానికి ఆ సంవత్సరం వచ్చే ఖాళీలను ఎప్పటికప్పుడు అవసరం మేరకు డీఎస్సీ నిర్వహించాలనే యోచన కూడా చేస్తుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిచాలంటే రాష్ట్రంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండాలని నిపుణులు సైతం అభిప్రాయ పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.