AP Govt Jobs: ఎయిమ్స్‌ మంగళగిరిలో 645 పోస్టులు.. త్వరలో నియామక ప్రక్రియ ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ సంస్థల్లో భారీగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తాజాగా మంగళగిరి ఎయిమ్స్‌లో 645 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయమంత్రి..

AP Govt Jobs: ఎయిమ్స్‌ మంగళగిరిలో 645 పోస్టులు.. త్వరలో నియామక ప్రక్రియ ప్రారంభం..
AIIMS Mangalagiri

Updated on: Dec 21, 2022 | 11:45 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ సంస్థల్లో భారీగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తాజాగా మంగళగిరి ఎయిమ్స్‌లో 645 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. వీటిల్లో 65 టీచింగ్‌, 580 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మంత్రి ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. ఈ మేరకు రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

మంగళగిరి ఎయిమ్స్‌లో మొత్తం183 బోధనా సిబ్బంది పోస్టులు మంజూరవగా, వాటిల్లో 118 పోస్టులు భర్తీ అయ్యాయన్నారు. ఇక బోధనేతర సిబ్బందిలో 1,054 పోస్టులకుగానూ 474 భర్తీ అయ్యాయని మంత్రి వెల్లడించారు. ఇవి కాకుండా మరో 86 కాంట్రాక్టు పోస్టులు కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. వీటికి సంబంధించి తర్వలో నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us